ఔటర్ రింగు రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం..

by Sumithra |   ( Updated:2023-12-17 14:34:56.0  )
ఔటర్ రింగు రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం..
X

దిశ, వెబ్‌డెస్క్ : నగరంలోని గచ్చిబౌలి ఔటర్ రింగు రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. సర్వీస్ రోడ్డు నుంచి వేగంగా దూసుకువచ్చిన ఓ కారు.. ఓఆర్ఆర్ మెయిన్ రోడ్డుపై వెళ్తున్న మరో కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు కార్లు వేగంలో ఉన్న కారణంగా ఒక్కసారిగా రెండు కార్లు గాల్లోకి లేచి కిందపడ్డాయి. ఈ ఘటనలో మొత్తం నలుగురు గాయపడ్డారు. అయితే, తీవ్ర గాయాలతో కారు దిగి ఓ మహిళ రోడ్డుపైనే కుప్పకూలిపోయింది. క్షతగాత్రులను దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed