- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. సోమవారం ప్రగతి భవన్‌లో పదో తరగతి పరీక్షలపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, సీఎంవో ముఖ్యకార్యదర్శి ఎస్. నర్సింగ్‌రావుతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం పదో తరగతి పరీక్షల రద్దుపై నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రంలో 5లక్షల 34వేల 903 మంది టెన్త్ విద్యార్థులు ఉన్నారు. మొత్తం ఆరు సబ్జెక్టులు, 11 పేపర్లు ఉండగా రెండు సబ్జెక్టులకు సంబంధించిన 3 పేపర్ల పరీక్షలు మార్చినెలలో పూర్తయ్యాయి. ఆ సమయంలో పరీక్షలను హైకోర్టు వాయిదా వేయడంతో ఇప్పటివరకు జరగలేదు. ఇదే క్రమంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు అనుసరిస్తున్న పద్దతులను పరిశీలించిన సీఎం, తెలంగాణలో ఏం చేయాలన్నదానిపై సుదీర్ఘంగా చర్చలు జరిపి, అనంతరం తెలంగాణలో అనుసరించాల్సిన పద్ధతిని ఖరారు చేశారు. గతంలో పాఠశాలల్లో నిర్వహించిన ఇంటర్నల్ అసెస్మెంట్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా వచ్చే గ్రేడులను పరగణనలోకి తీసుకుని విద్యార్థులను పై తరగతికి ప్రమోట్ చేయాలని సీఎం నిర్ణయించారు. డిగ్రీ, పీజీ తదితర పరీక్షల నిర్వహణకు సంబంధించి భవిష్యత్ పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.