ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు

by Anukaran |   ( Updated:2020-07-09 08:37:24.0  )
ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా ఇంటర్‌లో ఫెయిలైన విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయంతో 1.47లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది. ఇప్పుడు పాసైన వారందరికీ కంపార్ట్‌మెంట్లలో పాసైనట్లు గుర్తింపు ఉంటుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. జులై 31తర్వాత సంబంధిత కాలేజీల్లో మార్కుల మెమోల జారీ ఉంటుందని తెలిపారు. రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఫలితాలను పదిరోజుల్లో అందజేస్తామని మంత్రి పేర్కొన్నారు.

Advertisement

Next Story