AP: టెన్త్ పరీక్షలకు డేట్ ఫిక్స్!

by srinivas |   ( Updated:2021-06-16 07:14:29.0  )
AP: టెన్త్ పరీక్షలకు డేట్ ఫిక్స్!
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో పదవ తరగతి పరీక్షల నిర్వహణ తేదీలు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. జూలై 26 నుంచి ఆగస్ట్ 2 వరకు పదవ తరగతి పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వానికి పాఠశాల విద్యా శాఖ కమిషనర్ చినవీరభద్రుడు ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. పదవ తరగతి పరీక్షలకు 6.28 లక్షల మంది విద్యార్ధుల హాజరవుతారని.. 4 వేల సెంటర్లలో పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. పరీక్షల నిర్వహణలో 80 వేల మంది ఉపాద్యాయులు, సిబ్బంది పాల్గొంటారని.. 11 పేపర్ల బదులు ఏడు పేపర్లకి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వానికి సూచిస్తామని చినవీరభద్రుతు తెలిపారు.

సెప్టెంబర్ 2 లోపు పరీక్షా ఫలితాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. గత ఏడాది కరోనా కారణంగా పరీక్షలు రద్దు చేయాల్సి వచ్చిందని.. ఈ ఏడాది సెకండ్ వేవ్ కారణంగా పరీక్షలు వాయిదా వేయాల్సి వచ్చిందని తెలిపారు. పరీక్షలు నిర్వహించకపోతే విద్యార్ధులకి నష్టం కలుగుతుందన్నారు. కొవిడ్ నిబంధనలు అనుసరించి పరీక్షలు నిర్వహించడానికి సిద్దంగా ఉన్నామని ప్రకటించారు. గురువారం సిఎం వైఎస్ జగన్ నేతృత్వంలో జరగబోయే విద్యా శాఖపై సమీక్షలో పరీక్షల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed