- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ- ఆంధ్ర సరిహద్దు వద్ద ఉద్రిక్తత.. కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ..
దిశ, మహబూబ్‌నగర్: కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ ఆంధ్ర మందు బాబులు తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో ఆందోళనకు దిగారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి జోగులాంబ గద్వాల జిల్లా పుల్లూరు టోల్ ప్లాజా సమీపంలో వైన్ షాప్ ఉంది. ఇది తెలంగాణ – ఆంధ్ర బార్డర్‌లో ఉంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అత్యధిక రాబడి ఈ వైన్ షాప్‌లోనే ఉంటుంది. దీనికి కారణం.. సమీపంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు, తదితర ప్రాంతాలకు చెందిన ఆంధ్ర మందు బాబులు పెద్ద ఎత్తున ఇక్కడ మందు కొనుగోలు చేయడానికి ప్రతిరోజూ వేల సంఖ్యలో వస్తూ ఉంటారు.
ఈ క్రమంలో మంగళవారం ఉండవెల్లి పోలీసులు పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలిసులు చాలా మంది మందు బాబులను పట్టుకొని వారి నుండి వివరాలు సేకరించారు. ఈ క్రమంలో వందల సంఖ్యలో ఉన్న మందుబాబులు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. ఇక్కడ మందు అమ్ముతారు. అక్కడ కేసులు పెడతారా..? ఇదెక్కడి అన్యాయం అంటూ రోడ్డుపై బైఠాయించారు. ఈ క్రమంలో కొంతమంది వాహనదారులు తమ వాహనాలను తీసుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు, మందుబాబులకు పెద్దఎత్తున వాదోపవాదాలు జరిగాయి. దీంతో మందుబాబులు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.