రంగారెడ్డి జిల్లాలో ఉద్రిక్తత

by Shyam |
రంగారెడ్డి జిల్లాలో ఉద్రిక్తత
X

దిశ, వెబ్ డెస్క్: రంగారెడ్డి జిల్లాలోని కోకాపేట్ లోని శాంతినగర్ కాలనీలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రెవెన్యూ అధికారులు, కాలనీ వాసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకుని గుడిసెలు తొలగించారు. దీంతో అధికారులు, కాలనీవాసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎన్నికల సమయంలో తమకు పక్కా ఇళ్లు కట్టిస్తామని ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చారని, కానీ ఇలా చెప్పాపెట్టకుండా వచ్చి గుడిసెలు తొలగించడం ఏంటని కాలనీ వాసులు అధికారులను ప్రశ్నించారు. దీంతో పోలీసులు అక్కడ భారీగా మోహరించారు.

Advertisement

Next Story