షర్మిల సభ వద్ద ఉద్రిక్తత.. రచ్చ చేసిన మహిళలు.. ఎందుకో తెలుసా.?

by Shyam |
షర్మిల సభ వద్ద ఉద్రిక్తత.. రచ్చ చేసిన మహిళలు.. ఎందుకో తెలుసా.?
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో రాజన్న రాజ్యం తెస్తానంటూ తెలంగాణలో పార్టీని స్థాపించి.. దీక్షలు, సభలు పెడుతున్న వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిలకు ఊహించని షాక్ తగిలింది. మేడ్చల్ జిల్లాలోని ఫిర్జాదిగూడలో షర్మిల నిరసన చేపట్టనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో సభకు అధిక మొత్తంలో మహిళలు హాజరయ్యారు. అంతా సజావుగా సాగుతుందనుకుంటున్న సమయంలో సభలో ఉన్న మహిళలు గొడవకు దిగి నిరసన తెలపడంతో అంతా అవాక్కయ్యారు. వారిని సర్దిచెప్పేందుకు సభా నిర్వాహకులు ప్రయత్నాలు చేశారు. అయితే సభలో పాల్గొన్న మహిళలు రోజువారి కూలీ పనులు చేసుకునే అడ్డాకూలీలు అని తెలిసింది. సభలో కూర్చుంటే వారికి రూ.400 ఇస్తామని చెప్పి ఇప్పుడు డబ్బులివ్వడం లేదని దీక్షాస్థలి వద్దే నిరసన తెలపడంతో కొంతసేపు సభ వద్ద ఉద్రిక్తత నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed