పలాస టోల్‌ప్లాజా వద్ద ఉద్రిక్తత

by srinivas |
పలాస టోల్‌ప్లాజా వద్ద ఉద్రిక్తత
X

దిశ,వెబ్‌డెస్క్: శ్రీకాకుళం పలాస టోల్ ప్లాజా వద్ద శుక్రవారం ఉద్రిక్తత నెలకొంది. టోల్ ప్లాజా సిబ్బందికి ఇంటింటికి రేషన్ బియ్యం వాహనదారుల మధ్య ఘర్షణ నెలకొంది. టోల్ ఫీజు చెల్లించాలని రేషన్ బియ్యం వాహనాలను టోల్ ప్లాజా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో టోల్‌గేట్ వద్ద సైరన్లతో బియ్యం వాహనదాదులు మోత మోగించారు. సమాచారం అందుకుని రెవెన్యూ అధికారులు టోల్ గేట్ వద్దకు చేరుకున్నారు. ఇరు పక్షాలకు అధికారులు సర్దిచెప్పటంతో వివాదం సర్దు మణిగింది.

Advertisement

Next Story