షాకింగ్‌ న్యూస్.. ప్రముఖ టెన్నిస్‌ క్రీడాకారిణి మిస్సింగ్.. ప్రభుత్వంపై అనుమానం!

by Anukaran |
షాకింగ్‌ న్యూస్.. ప్రముఖ టెన్నిస్‌ క్రీడాకారిణి మిస్సింగ్.. ప్రభుత్వంపై అనుమానం!
X

దిశ, స్పోర్ట్స్: చైనాకు చెందిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి పెంగ్ షుయ్ అదృశ్యం కావడం సంచలనంగా మారింది. 35 ఏళ్ల పెంగ్ షుయ్ ఇటీవల ఒక మాజీ ఉన్నతాధికారి తనను లైంగికంగా వేధించాడని ఆరోపించింది. ఆ తర్వాత ఆమె కనిపించకుండా పోయింది. గత రెండు వారాలుగా ఆమె ఆచూకీ లభించలేదు. దీనిపై చైనా ప్రభుత్వం కూడా నోరు మెదపక పోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. తాజాగా చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జావో లిజియాన్ ఈ విషయంపై స్పందించారు. ఆమె అదృశ్యమైనట్లు తమకు తెలియదని.. అసలు ఈ వివాదం దౌత్యపరమైనది కాదని అన్నారు. దీంతో చైనా ప్రభుత్వం ఏదో దాచి పెడుతున్నట్లు అందరూ అనుమానిస్తున్నారు.

చైనాలో అధికార కమ్యూనిస్టు పార్టీకి చెందిన పోలిట్ బ్యూరో స్టాండింగ్ కమిటీ సభ్యుడు జాంగ్ గోలీ తనతో బలవంతంగా సెక్స్ చేసినట్లు పెంగ్ షుయ్ ఆరోపించింది. నేను నిరాకరించినా.. అతడు నాతో సెక్స్ చేశాడు అంటూ చైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వైబోలో పోస్టు పెట్టింది. ఆ తర్వాత వెంటనే ఆ పోస్టు తొలగించినప్పటికీ.. కొంత మంది దాన్ని స్క్రీన్ షాట్ తీసి వైరల్ చేశారు. ఆ తర్వాతే పెంగ్ షుయ్ అదృశ్యం కావడంతో వివాదం ముదిరింది. అయితే పెంగ్ సురక్షితంగానే ఉన్నదని చెబుతూ చైనా స్టేట్ మీడియా నుంచి తనకు మెయిల్ వచ్చినట్లు డబ్ల్యూటీఏ చైర్మన్ స్టీవ్ సైమన్ తెలిపారు. పెంగ్ షుయ్ 2013 వింబుల్డన్, 2014 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ గెలిచింది. అంతే కాకుండా మూడు ఒలింపిక్స్‌లలో ఆమె పాల్గొన్నది. కీలకమైన 2022 వింటర్ ఒలింపిక్స్ సమీపిస్తున్న సమయంలో ఆమె అదృశ్యం కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed