- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆస్పత్రి పాలైన కార్మికులు.. కోవిడ్ వ్యాక్సినే కారణమా.?
దిశ, వెబ్ డెస్క్:గుంటూరు జిల్లా తెనాలిలో మున్సిపల్ పారిశుధ్య కార్మికులు వరుసగా అనారోగ్యానికి పాలవుతుండటం కలకలం రేపుతుంది. 15 రోజుల క్రితం కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న పారిశుధ్య కార్మికులు అనారోగ్యానికి గురవుతున్నారు. మంగళవారం తీవ్ర అనారోగ్యానికి గురైన ఏడవ డివిజన్ పారిశుధ్య కార్మికుడు దుర్గా ప్రసాద్(30) మృతి చెందారు. ఆ ఘటన మరువకముందే బుధవారం ఉదయం మరో శానిటరీ వర్కర్ వాంతులు విరేచనాలతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. ఏడో డివిజన్ సానిటరీ వర్కర్ నల్లగొర్ల రమణమ్మ అనారోగ్యానికి గురవ్వడంతో ఆమెను గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు వైద్యులు తెలిపారు. ఆమెను ఆస్పత్రికి తరలించిన కొద్దిసేపటి తర్వాత మరో శానిటరీ వర్కర్ కాబోటి వెంకటలక్ష్మి అనారోగ్యానికి గురయ్యారు. ఇలా వరుసగా పారిశుద్ధ్య కార్మికులు అస్వస్థతకు గురి కావడంతో వ్యాక్సిన్ వేయించుకున్న తోటి కార్మికులు ఆందోళన చెందుతున్నారు.