70 కాదు.. 107 ఎకరాల్లో అయోధ్య రామాలయం

by Shamantha N |   ( Updated:2021-03-03 22:37:46.0  )
70 కాదు.. 107 ఎకరాల్లో అయోధ్య రామాలయం
X

దిశ వెబ్‌డెస్క్: రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర టస్టు కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్య రామ్‌మందిర్ నిర్మాణానికి సంబంధించి స్థలాన్ని పెంచింది. ఇంతకుముందు ఆలయ నిర్మాణం కోసం 70 ఎకరాలు మాత్రమే కొనుగోలు చేసింది. కానీ తాజాగా రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర టస్టు ఆలయ నిర్మాణానికి సంబంధించి మార్పులు చేసింది. ఆలయ నిర్మాణ స్థలాన్ని పెంచింది. ఆలయ నిర్మాణం కోసం తాజాగా రామజన్మభూమి పరిసరాల్లోని 7,285 చదరపు అడుగుల స్థలాన్ని కొనుగోలు చేసింది.

ఆలయ సంక్లిష్ట ప్రాంతాన్ని 70 ఎకరాల నుండి 107 ఎకరాలకు విస్తరించే ప్రణాళిక ప్రకారం ఈ భూమి కొనుగోలు చేసినట్లు టస్టు అధికారులు వెల్లడించారు. అయోధ్యలో రామమందిర్ నిర్మాణం కోసం యావత్ భారత్ ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ భూమిపూజ చేయగా.. ప్రస్తుతం ఆలయ నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి.

అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ ఎత్తున అయోధ్యలో రామ్‌మందిర్ నిర్మాణం చేపడుతున్నారు. ఇప్పటికే ఆలయ నిర్మాణం కోసం విరాళాలు ఇవ్వాలని రామ్ జన్మభూమి ట్రస్ట్ కోరగా.. పెద్ద ఎత్తున విరాళాలు వస్తున్నాయి. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు సామాన్యులు కూడా రామమందిర్ నిర్మాణం కోసం స్వచ్ఛంధంగా ముందుకొచ్చి విరాళాలు ఇస్తున్నారు.

కాగా, అయోధ్యలో రామ్‌మందిర్ నిర్మాణం, దాని పర్యవేక్షణ బాధ్యతలను చూసేందుకు సుప్రీంకోర్టు ఆదేశాలతో రామ‌జన్మభూమి ట్రస్ట్‌ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ట్రస్ట్ ఆధర్వంలో ఇప్పుడు రామ్‌మందిర్ నిర్మాణం జరుగుతోంది.

Advertisement

Next Story

Most Viewed