కఠినమైన రూల్స్ పాటించేవాళ్లే ఇండస్ట్రీకి కావాలి : స్టార్ డైరెక్టర్

by Manoj |
కఠినమైన రూల్స్ పాటించేవాళ్లే ఇండస్ట్రీకి కావాలి : స్టార్ డైరెక్టర్
X

దిశ, సినిమా : ప్రముఖ దర్శకురాలు జోయా అక్తర్‌.. ఎవరైనా తన సినిమాల్లో పనిచేయాలంటే కఠినమైన రూల్స్ పాటించాలంటోంది. డైరెక్టర్‌గానే కాకుండా రైటర్‌గా సత్తా చాటుతున్న ఆమె తాజా ఇంటర్వ్యూలో తన వర్క్ స్టైల్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 'రాసుకున్నది రాసుకున్నట్టే చిత్రీకరించాలనే పట్టుదలతో ఉండను. ఏదైనా సీన్‌ షూట్‌ చేస్తున్నప్పుడు కొత్త ఐడియా వస్తే మార్చడానికి ఏమాత్రం వెనుకాడను. రీటేక్స్‌ విషయంలో చాలా లిబరల్‌గా వ్యవహరిస్తా. వైవిధ్యమైన నటీనటులతో పని చేయడం ఇష్టం.

సాంఘిక అంశాలు, నిజ జీవితాల్లోని అనుబంధాలను మిళితం చేసి సినిమాలు తీయడానికే మొగ్గుచూపుతా. షూటింగ్‌ షెడ్యూల్స్‌లో ఎవరికీ సెలవులు ఇవ్వను. ఎందుకంటే వాళ్లు తమ పాత్రల మూడ్ నుంచి బయటకు వెళ్లిపోతారని భయంగా ఉంటుంది' అంటూ తన కమిట్‌మెంట్ గురించి వివరించింది.

Advertisement

Next Story

Most Viewed