- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇకపై 10 నిమిషాల్లో వేడి వేడిగా ఫుడ్ డెలివరీ చేయనున్న జొమాటో!
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో త్వరలో 10 నిమిషాల్లో ఆహార పదార్థాలను వినియోగదారులకు చేరవేసే 'జొమాటో ఇన్‌స్టంట్' సేవలను ప్రారంభించనున్నట్టు సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. వచ్చే నెలలో మొదటగా ఈ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకురానున్నట్లు పేర్కొంది. దీనికి సంబంధించి జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్.. వినియోగదారులు తమ అవసరాలకు తగినట్లుగా తక్కువ సమయంలో డెలివరీ కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే జొమాటో రెస్టారెంట్ల భాగస్వామ్యంతో ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొస్తుందని చెప్పారు.
ప్రపంచంలో ఇప్పటివరకు 10 నిమిషాల్లో వేడి, తాజా ఆహారాన్ని ఎవరు డెలివరీ చేయలేదు. దీంతో తాము మొదటిసారిగా దీన్ని ప్రారంభించిన రికార్డును సొంతం చేసుకోగలమని ఆయన వివరించారు. ఈ కొత్త సేవలు అధిక డిమాండ్ ఉన్న కస్టమర్లకు ఉండే దూరం, రెస్టారెంట్ రద్దీపై ఆధారపడి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, ఇటీవల పలు ఈ-కామర్స్ కంపెనీలు తమ కిరాణా సరుకుల డెలివరీని 10 నిమిషాల్లో అందించే విధానానికి దేశవ్యాప్తంగా మెరుగైన ఆదరణ వస్తున్న తరుణంలో జొమాటో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.