- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫ్రెండ్స్‌కే ఆఫర్లు.. బాలీవుడ్ కల్చర్‌పై జరీనా ఖాన్
దిశ, సినిమా : బ్యూటిఫుల్ జరీనా ఖాన్ బాలీవుడ్ ఇండస్ట్రీ కల్చర్ గురించి ఓపెన్‌గా మాట్లాడేసేంది. పరిశ్రమలోకి అడుగు పెట్టి పదేళ్లయినా సరే ఇంకా మంచి రోల్స్ చేయకపోవడానికి కారణమేంటని చాలా మంది ప్రశ్నిస్తారన్న జరీనా.. ఇందుకు కారణం అందరితో కనెక్టింగ్‌గా లేకపోవడమేనని చెప్పింది. పార్టీలు, పబ్‌లు, అవార్డ్ ఫంక్షన్స్ అటెండ్ కావడం వల్ల స్టార్స్ సర్కిల్ పెరుగుతుందని.. కానీ ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో తనకు ఈ విషయం తెలియక వెనుకబడిపోయానని తెలిపింది.
ఇక్కడ ఫిల్మ్ మేకర్స్ తమ ఫ్రెండ్స్‌కు మాత్రమే ఆఫర్ ఇచ్చినప్పుడు తనలాంటి వారు ఇలాగే వెయిట్ చేయాల్సి వస్తుందని తెలిపింది. ఇక్కడ నెట్ వర్క్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, తమ పరిధిలో ఉన్నవారికే ఆఫర్స్ ఇచ్చిపుచ్చుకోవడం ఉంటుందని వివరించింది. ఇక తన విషయంలో జడ్జ్‌మెంట్ దారుణంగా ఉందన్న బ్యూటీ.. స్క్రీన్‌పైన కనిపించినట్లుగా నిజజీవితంలోనూ ఉండమని, మంచి క్యారెక్టర్స్ పడితేనే యాక్టర్స్ రాణించగలుగుతారని తెలిపింది. తనను కేవలం గ్లామర్ డాల్‌గా చూపడం మానేసి స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఇస్తే నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పింది.