- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
YS Sharmila: నువ్ చెప్పే మాటలన్నీ పచ్చి అబద్ధం
దిశ, మణుగూరు: YSRTP Chief YS Sharmila Visits Flood Affected Areas In Khammam| తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసి నట్టేట్ల ముంచడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమంటూ వైఎస్ఆర్ టీపీ అధినేత వైఎస్. షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం పినపాక మండలంలోని వరదకు గురైన ముంపు ప్రాంతాలు రావిగూడెం, చింతలబయ్యారం తదితర ప్రాంతాలను సందర్శించారు. అనంతరం బయ్యారం క్రాస్ రోడ్ లో ఉన్న వైఎస్. రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రాయగూడెం గ్రామపంచాయతీలో గోదావరి వరదలతో మునిగిపోయిన ఇళ్లను పరిశీలించి, వరద ముంపు బాధితులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... గోదావరి వరదలో ఇల్లు కోల్పోయిన ప్రజలకు నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పిన మాటలు పచ్చి అబద్ధపు మాటలని ఆమె చెప్పుకొచ్చారు. గతంలో కూడా వరంగల్, ఖమ్మం రైతులను ఈ విధంగానే మోసం చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియా ముందు ఒకటి మాట్లాడాటం.. ఫామ్ హౌజ్ లో మరొకటి మాట్లాడటం కేసీఆర్ కి వెన్నెతో పెట్టిన విద్యన్నారు. రాష్ట్రంలో చేతగాని పరిపాలన ఎందుకు.. వెంటనే పదవికి రాజీనామా చేయాలని విమర్శించారు. సర్వం కోల్పోయిన వరద భాదితులను పట్టించుకోనప్పుడు సీఎం పదవి ఎందుకని ప్రశ్నించారు. వరద బాధితులకు ఇస్తానన్న 10 వేల రూపాయలు ఇంతవరకు చెల్లించలేదని, 10 వేల రూపాయలు ఏమూలకు సరిపోతాయని ఘాటుగా ప్రశ్నించారు.
వరద బాధితులకు తక్షణమే 25 వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే వరద బాధితులకు సహాయం చేస్తానని చెప్పి రబ్బర్ బియ్యం ఇవ్వడం పదవికే సిగ్గు చేటని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఎలా ముఖ్యమంత్రి అయ్యారని విమర్శల వర్షం కురిపించారు. పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. లేనిచో పేద ప్రజలతో కలిసి వైఎస్ఆర్ టీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ టీపీ జిల్లా నాయకులు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: మండలంగా మారిన గట్టుప్పల... ఇదంతా ఉప ఎన్నిక మహత్యమేనా...?
- Tags
- YS Sharmila
- YSRTP