వైఎస్ఆర్‌సీఎల్పీ భేటీ.. మంత్రివర్గ విస్తరణపై కీలక చర్చ

by Nagaya |
AP Cabinet
X

దిశ, ఏపీ బ్యూరో : మార్చి 15న వైఎస్ఆర్ సీఎల్పీ భేటీ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో మంత్రి వర్గ విస్తరణపై సీఎం వైఎస్ జగన్ ఓ క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సీఎల్పీ సమావేశంలోనే ఎవరు ఉంటారు..? ఎవరికి ఉద్వాసన...? కేబినెట్‌లోకి చేరే వారి అంశంపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అనంతరం మంత్రి వర్గ విస్తరణకు రంగం సిద్ధం చేస్తారని తెలుస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలోపే మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే మంత్రివర్గ విస్తరణలో చోటు కోసం చాలా మంది ఆశావాహులు ఉన్నారంటూ సీఎం జగన్ వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గంలో స్థానం లేనంత మాత్రాన పక్కన పెట్టినట్లు భావించొద్దని చెప్పారు. మళ్లీ గెలిచి వస్తే మంత్రులుగా ఉండేది మీరేనని అన్నారు. మంత్రివర్గం లేని వారు.. పార్టీకి పని చేయాలని సీఎం సూచించారు. అంటే ఈ సారి జగన్ కేబినెట్ కూర్పు చాలా కష్టంగానే ఉంటుందని తెలుస్తోంది. ఈ కేబినెట్ కూర్పు అంతా వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ఉండబోతుందని తెలుస్తోంది.

Advertisement

Next Story