YS Jagan Cabinet: జగన్ కేబినెట్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు

by Manoj |   ( Updated:2022-04-09 11:55:28.0  )
YS Jagan Cabinet: జగన్ కేబినెట్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు
X

దిశ, ఏపీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌‌లో ఈనెల 11న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. అయితే నూతన మంత్రులు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్‌ 11న ఉదయం 11 గంటల 31 నిమిషాలకు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రుల ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్‌‌, సీఎం జగన్‌తో కలిసి కొత్త మంత్రుల ఫోటో షూట్ జరగనుంది.అనంతరం తేనేటి విందు జరగనుంది.

ఈ కార్యక్రమంలో గవర్నర్ బీబీ హరిచందన్‌తోపాటు సీఎం వైఎస్ జగన్ పాత, కొత్త మంత్రులు పాల్గొంటారని తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణలో భాగంగా సీఎం వైఎస్ జగన్ ఈనెల 7న తన కేబినెట్‌ను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి ఆదేశాలతో జగన్ కేబినెట్‌లోని 24మంది మంత్రులు తమ పదవులకు రాజీనామాలు చేసిన విషయం విదితమే. అయితే కొత్త కేబినెట్ ఈనెల 11న కొలువుదీరనుంది. ఇందుకు ఏర్పాట్లు సైతం చకచకా జరుగుతున్నాయి. ప్రమాణ స్వీకారంకు సంబంధించిన వేదిక ఏర్పాట్లను సీఎస్‌తోపాటు ఇతర అధికారులు పరిశీలించిన సంగతి తెలిసిందే.



Advertisement

Next Story