యువతి ఆత్మహత్య.. ప్రేమ వ్యవహారమే కారణమా..?

by Web Desk |
యువతి ఆత్మహత్య.. ప్రేమ వ్యవహారమే కారణమా..?
X

దిశ, గజ్వేల్: ప్రేమ వివాదాలతో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గజ్వేల్‌ కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రజ్ఞాపూర్‌కు చెందిన ఎల్ల సంగీత (17) గజ్వేల్ పట్టణంలోని గీతాంజలి కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. ఇదే గ్రామానికి చెందిన సల్ల శ్రీకాంత్ అలియాస్ అర్జున్ గత కొంత కాలంగా తనను ప్రేమించాలని సంగీతని ఒత్తిడి చేశాడు. పలుమార్లు యువకుడిని బెదిరించిన తనలో మార్పు రాకపోగా తనను ప్రేమించక పోతే చంపేస్తానని బెదిరించడంతోనే సంగీత తీవ్ర ఒత్తిడికి గురైంది.





దీంతో గురువారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం స్థానిక హస్సటల్ కి తరలించారు. ఈ ఘటన తెలుసుకున్న గీతాంజలి కాలేజి విధ్యార్థులు గజ్వేల్-ప్రజ్ఞాపూర్‌ రోడ్డుపైకి చేరుకుని స్థానిక హస్పటల్ ఎదురుగా భైఠాయించి ధర్నాకు దిగారు. సంగీతకు న్యాయం చేయాలని యువతి మరణానికి కారణమైన యువకుడిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ హస్పటల్ ఎదుట బైఠాయించారు.





సంగీత ఫోటోలతో కూడిన ప్లకార్డులు పట్టుకోని ''వి వాంట్ జస్టిస్'' అంటూ నినాదాలు చేస్తూ అరగంట పాటు ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఎసిపి రమేష్ యువతి బంధువులతో ఫోన్లో మాట్లాడారు. మృతి సంఘటనపై కేసు నమోదు చేశామని సమగ్ర దర్యాప్తు నిర్వహించి బాధితులకు న్యాయం చేస్తామన్నారు. నిందితున్ని అదుపులోకి తీసుకోని విచారణ జరుపుతామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ధర్నాను విరమించారు.

Advertisement

Next Story