ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

by samatah |   ( Updated:2022-03-12 08:59:27.0  )
ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి
X

దిశ, గుడిహత్నూర్ : మోటర్ సైకిల్‌ను ట్రాక్టర్ ఢీకొని ఒకరు మృతి, ఇద్దరికి తీవ్రగాయాలు అయిన సంఘటన సీతాగొంది గ్రామ సమీపంలో వాఘాపుర్ వెళ్ళే యూ టర్న్ వద్ద చోటుచేసుకుంది. స్థానికులు , పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలో‌నీ రాజీవ్ నగర్‌కు చెందిన నారాయణ (25) యువకుడు, మరో ఇద్దరు రయీస్, యాదవ్ తో కలిసి మోటర్ సైకిల్ పై గుడిహత్నూర్ నుండి ఆదిలాబాద్ వైపు పని నిమిత్తం వెళ్తుండగా, అదే వైపు నుండి ట్రాక్టర్ వాఘాపూర్ యూ టర్న్ వద్ద మలుపు తిప్పుతూ వీరు ప్రయాణిస్తున్న మోటర్ సైకిల్‌ను వెనుక నుంచి ఢీ కొంది. దీంతో నారాయణ రావు అనే యువకుడికి తీవ్ర రక్త స్రావం అయి సంఘటన స్థలంలో నే మృతి చెందాడు, మరో ఇద్దరు రాయిస్, యాదవ్‌కు తీవ్ర గాయాలు కావడంతో రిమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. అలాగే ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Next Story