- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Citadel: Honey Bunny: నా కెరీర్‌లో మర్చిపోలేను.. ‘సిటాడెల్-హనీ బన్నీ’ సిరీస్‌పై యంగ్ హీరో కామెంట్స్
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha), వరుణ్ ధావన్ జంటగా నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్నీ’(Citadel: Honey Bunny). రాజ్ అండ్ డీకే(Raj and DK) దర్శకత్వం వహించిన ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్(Amazon Prime)లో నవంబర్ 7 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చింది. అంతే కాకుండా.. ప్రజెంట్ అమెజాన్‌లో ట్రెండింగ్‌లో కొనసాగుతూ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది చూసిన సిరీస్‌గా నంబర్ 1 ప్లేస్‌లో దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే.. ‘అలనాటి సిత్రాలు, శాకుంతలం,హ్యాపీ ఎండింగ్’ వంటి సినిమాలతో టాలెంటెడ్ యంగ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు యష్ పూరి (Yash Puri).. ‘సిటాడెల్’లో కీలక పాత్రలో నటించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నారు.
ఈ క్రమంలోనే యష్ పూరి తాజాగా సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ షేర్ చేశారు. ‘ఈ అవకాశాన్ని ఇచ్చిన రైటర్ సీతాకు, తనకు సపోర్ట్ చేసిన నటి సమంత అండ్ దర్శకులు రాజ్ డీకేకు కృతజ్ఞతలు. సమంత, వరుణ్ లాంటి పవర్ హౌస్ పర్ ఫార్మర్స్‌తో కలిసి నటించే అవకాశం రావడం నా కెరీర్‌లో మర్చిపోలేను’ అంటూ యష్ పూరి తన పోస్ట్‌లో తెలిపారు.