ఆరోగ్యం కోసం.. యోగా క్లాస్‌లు ప్రారంభం

by samatah |   ( Updated:2022-03-22 10:04:44.0  )
ఆరోగ్యం కోసం.. యోగా క్లాస్‌లు ప్రారంభం
X

దిశ, వెబ్‌డెస్క్ : యోగా ఆరోగ్యానికి మంచిది. ప్రతి రోజు యోగ చేయడం ద్వారా ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరకుండా స్ట్రాంగ్‌గా ఉంటారు. ఆరోగ్యాన్ని ఎవరు కోరుకోరు.. వారికోసమే ఈ సమాచారం. శ్రీ సత్యసాయి ధ్యానమండలి వారి ఆధ్వర్యంలో, శ్రీ రఘు గురూజీచే జూమ్‌లో యోగా క్లాస్‌లను ప్రారంభించారు. మార్చి 28 సోమవారం నుంచి ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు యోగా క్లాస్‌లు నిర్వహించబడును. అలాగే పిల్లల కోసం ప్రత్యేకంగా చిల్డ్రన్ పర్సనాలిటీ డెవలప్ మెంట్ సమ్మర్ ప్రోగ్రాం ద్వారా సమ్మర్ క్యాంప్‌ను మే, 1 నుంచి 10 రోజులు క్లాస్‌లు నిర్వహించనున్నారు. ఈ క్లాస్‌లకు ఆరవ తరగతి నుంచి పదవ తరగతి విద్యార్థులు అర్హులు. యోగా నేర్చుకుందాం అనుకునే వారు9849337232నెంబర్‌కు వాట్సాప్ చేసి యోగా క్లాస్‌లకు అటెండ్ కావచ్చు.





Advertisement

Next Story

Most Viewed