- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వైసీపీకి స్టార్ క్యాంపెయినర్లు దూరం.. ఐదేళ్లలో సీన్ రివర్స్
దిశ, ఏపీ బ్యూరో : 'జగనన్న వదిలిన బాణాన్ని.. మీ రాజన్న ముద్దుబిడ్డను. అన్నకు ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ'.. చెల్లి వైఎస్ షర్మిల. 'నా కొడుకును మీ చేతుల్లో పెడుతున్నా.. ఓటు వేసి గెలిపించండి.. తండ్రిని మించిన పాలన అందిస్తాడు' అని వైఎస్ విజయమ్మ. 'ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ' రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్ సుడిగాలి పర్యటన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్టార్ కాంపైనర్లుగా వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల నిలిచారు. ఆ తర్వాత సినీ నటులూ ప్రచారం చేశారు. ఇదంతా 2019 ఎన్నికల హంగామా.
సీన్ కట్ చేస్తే 2024 వచ్చే సరికి అంతా రివర్స్. తెలంగాణలో వైఎస్ షర్మిల సొంత పార్టీ ఏర్పాటైంది. కూతురు కోసం వైఎస్ విజయమ్మ హైదరాబాద్‌కు వచ్చేశారు. మరోవైపు సినీ నటులూ వైసీపీకి దూరంగా ఉంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే 2024 ఎన్నికల్లో వైసీపీకి స్టార్ కాంపైనర్లు ఎవరు? వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మ లోటును వైఎస్ జగన్ ఎలా పూడుస్తారనేది తెలియాల్సి ఉంది. ఈసారి వైసీపీకి స్టార్ కాంపైనర్లు కరువు అంటూ రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం, జనసేన పార్టీలకే స్టార్ కాంపైనర్లు ఎక్కువని వార్తలు గుప్పుమంటున్నాయి.
2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, వైఎస్ జగన్ ఎంత కీలకమో. వైసీపీ తరుపుముక్క, స్టార్ కాంపైనర్ వైఎస్ షర్మిల, వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అంతే కారణం అన్నది బహిరంగ రహస్యం. వైఎస్ఆర్ కాంగ్రెస్‌ను స్థాపించిన తర్వాత వైఎస్ జగన్ జైలుకెళ్లారు. వైఎస్ షర్మిల అన్నీ తానై నడిపించారు. మరో ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్ర సైతం చేశారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చేందుకు అహర్నిశలు శ్రమించారు. ఒకవైపు అన్నకు అధికారం ఇవ్వండి ఒక్క ఛాన్స్ అని అడగడంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని మరిపించేవారు. వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ పరోక్షంగా వైసీపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు చాలా గట్టిగానే కృషి చేశారు. 2024 రాబోవు ఎన్నికల నాటికి అంతా రివర్స్‌లా కనబడుతున్నది. వైఎస్ షర్మిల వర్సెస్ వైఎస్ జగన్ అన్నట్లుగా కుటుంబాల్లో చీలిక వచ్చేసింది. చివరికి తల్లి వైఎస్ విజయమ్మ సైతం కూతురి గూటిలో చేరారు?. రాష్ట్రంలో వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ కొత్త పార్టీ పెడతారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో వైసీపీకి ఒక్క స్టార్ కాంపైనర్ లేనట్లేనని తెలుస్తోంది.
షర్మిల బాటలోనే వైఎస్ విజయమ్మ
వైఎస్ఆర్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ 2014, 2019 ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్నారు. 2014 ఎన్నికల్లో విశాఖపట్నం లోక్‌సభకు పోటీ చేసినప్పటికీ ఆమె రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 2019 ఎన్నికల విషయానికొస్తే ఉత్తరాంధ్రతోపాటు ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటించారు. వైఎస్ జగన్, వైఎస్ షర్మిల కవర్ చేయని నియోజకవర్గాల్లో వైఎస్ విజయమ్మ పర్యటించేవారు. 'నా కొడుకును మీ చేతుల్లో పెడుతున్నాను. నాడు కాంగ్రెస్ పార్టీ అకారణంగా జైల్లో పెట్టించింది. చంద్రబాబు ప్రభుత్వమూ వేధించింది. అసెంబ్లీలో గొంతు వినిపించకుండా ఇబ్బందులకు గురి చేశారు. వైసీపీ లేకుండా చేయాలని కుట్రపన్నారంటూ' వైఎస్ విజయమ్మ ప్రజలకు పదేపదే చెప్పారు. అలా వైఎస్ విజయమ్మ ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో దాదాపు అన్నింటా గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈసారి వైఎస్ విజయమ్మ ఎన్నికల ప్రచారానికి రాకుంటే వైఎస్ జగన్ మరో స్టార్ కాంపైనర్‌ను కోల్పోయినట్లేనని తెలుస్తోంది.
మంచు ఫ్యామిలీ మౌనం
మరోవైపు 2019 ఎన్నికల ప్రచారంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సైతం పాల్గొన్నారు. 2019 ఎన్నికల ముందు అప్పటికే వైఎస్ కుటుంబంతో బంధుత్వం ఉన్న మోహన్ బాబు అధికారికంగా వైసీపీలో చేరారు. ఎన్నికల సమయంలో పార్టీకి అనుకూలంగా ప్రచారం నిర్వహించారు. పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలలో వైసీపీ తరఫున ప్రచారం చేశారు. నారా లోకేశ్ పోటీ చేసిన మంగళగిరిలోనూ వైసీపీ అభ్యర్థి ఆర్కేకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. తాను జగన్‌ను సీఎంగా చూడాలనే కోరికతోనే ఎన్నికల్లో మద్దతుగా ప్రచారం చేశానని, తాను పదవులు ఆశించి కాదని చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై మంచు ఫ్యామిలీ అలిగిందని ప్రచారం జరుగుతుంది. ఇటీవల తనను కొందరు ఉపయోగించుకుని లబ్ధిపొందారే తప్ప తాను ఎవరి వల్ల లాభం పొందలేదని, మోసపోయానని తన బర్త్ డే వేడుకల్లో మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తాను రాజకీయాలకు దూరం అని కీలక ప్రకటన చేశారు. 2019 ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో మంచు విష్ణు ప్రచారం చేశారు. 2024లో రాబోవు ఎన్నికల్లో ప్రచారం చేస్తారా లేక తండ్రిబాటలోనే సైలెంట్‌గా ఉంటారా అనేది తెలియాల్సి ఉంది.
2019లో ప్రచారం నిర్వహించిన నటులు దూరం
ఇక సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఉత్తరాంధ్రలో వైసీపీ గెలుపు కోసం పృథ్వీరాజ్ సైతం శ్రమించారు. ఎస్వీబీసీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. తదుపరి పరిణామాల నేపథ్యంలో ఆ పదవి నుంచి తొలగాల్సి వచ్చింది. జీవిత, రాజశేఖర్, జయసుధ కూడా పాల్గొన్నారు. అనంతరం జీవిత రాజశేఖర్ దంపతులు బీజేపీలో చేరారు. జయసుధ సైతం రాజకీయాలకు దూరంగా ఉంటారని ప్రచారం జరుగుతుంది. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున ప్రచారం నిర్వహించిన నటులు తనీష్, కృష్ణుడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
2024లో వీళ్లే స్టార్ కాంపైనర్లు
2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్టార్ కాంపైనర్‌గా రోజా, అలీ, పోసాని కృష్ణ మురళిలే. వైసీపీ ఇప్పటికే స్టార్ కాంపైనర్లపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులు, ముగ్గురు పురుష ఎమ్మెల్యేలతో కలిసి స్టార్ కాంపైన్ నిర్వహించే అవకాశం ఉంది. ఈసారి వైఎస్ భారతి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని తెలుస్తోంది. మంచు విష్ణు సైతం బావ కోసం ప్రచారం చేస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి 2024లో వైసీపీ స్టార్ కాంపైనర్ల జాబితా ఎలా ఉండబోతున్నదనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.