Presidential Candidate: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి ఖరారు.. అనివార్యమైన ఎన్నిక!

by GSrikanth |   ( Updated:2022-06-21 11:09:21.0  )
Yashwant Sinha to be announced as a Opposition Presidential Candidate
X

దిశ, వెబ్‌డెస్క్: Yashwant Sinha to be announced as a Opposition Presidential Candidate| దేశ రాజకీయాల్లో రాష్ట్రపతి ఎన్నిక తీవ్ర కాక రేపుతోంది. దేశ వ్యాప్తంగా అన్ని జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలు కూడా ఈ ఎన్నికను చాలా సీరియస్‌గా తీసుకున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఇప్పటికే ఏకతాటిపైకి వచ్చిన విపక్షాలు రాష్ట్రపతి ఎన్నికల పట్ల చాలా జాగ్రత్త వహిస్తున్నాయి. బలమైన అభ్యర్థి కోసం తీవ్ర స్థాయిలో చర్చలు చేసిన విపక్షాలు.. తాజాగా అభ్యర్థిని ఖరారు చేశాయి. విపక్ష పార్టీల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పేరును ఖరారు చేశాయి. ఈ మేరకు కాసేపట్లో అధికారికంగా ప్రకటించనున్నారు. కాగా, మరోపక్క రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల తరపున బరిలో నిలిచేందుకు యశ్వంత్ సిన్హా సైతం ఇప్పటికే సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన టీఎంసీకి రాజీనామా చేసినట్లు సమాచారం. జాతీయ ప్రయోజనాల కోసం పనిచేయడానికి, విపక్షాల ఐక్యత కోసం పనిచేయడానికి పార్టీ నుంచి బయటకు రావాల్సిన అవసరం అనివార్యమైందని ఆయన వ్యాఖ్యానించడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. చివరగా విపక్షాలు సైతం ఆయన పేరునే ఖరారు చేయడంతో ఎన్నిక అనివార్యమైంది. కాగా, విపక్షాల అభ్యర్థికి ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం మద్దతు తెలిపారు. ఈ మేరకు ఎస్సీపీ అధినేత శరద్ పవార్‌తో కేసీఆర్ ఫోన్‌లో మాట్లాడారు. అనంతరం యశ్వంత్ సిన్హా అభ్యర్థిత్వాన్ని ఓకే చెప్పి మద్దతు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed