Yashwant Sinha: దేశంలో ప్రజాస్వామ్యం నాశనమైంది : యశ్వంత్ సిన్హ

by S Gopi |   ( Updated:2022-07-16 13:08:18.0  )
Yashwant Sinha Says Democracy Destroyed in India
X

న్యూఢిల్లీ: Yashwant Sinha Says Democracy Destroyed in India| రాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం నాశనమైందని అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రపతి ఎన్నికల గుర్తింపును ప్రశ్నగా మార్చకూడదని, సిద్ధాంతం కోసం పోరాటమని అన్నారు. 'గత నెలలో నేను ప్రచారం ప్రారంభినపుడు దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని చెప్పాను. కానీ నేడు అది నాశనమైంది' అని తెలిపారు. ఓటర్లు (ఎలక్టోరల్ కాలేజీ) వారి మనస్సాక్షి మేరకు తర్వాత తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. జార్ఖండ్‌లో పర్యటించిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాంగ్రెస్, ఆర్జేడీ, జార్ఖండ్ ముక్తి మోర్చాలతో కూడిన సోరెన్ ప్రభుత్వం ముందుగా సిన్హాకు మద్దతివ్వగా, ఆ తర్వాత మాట మార్చారు. ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇస్తున్నట్లు సోరెన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో సిన్హా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

ఇది కూడా చదవండి: ఇక ఢిల్లీలోనే తేల్చుకుంటా.. మోడీపై యాక్షన్ ప్లాన్ ప్రకటించిన కేఏపాల్

Advertisement

Next Story

Most Viewed