- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అప్పుడు యమున నదిలో ఎక్కడైనా మునగొచ్చు.. మంత్రి సత్యేందర్ జైన్ కీలక వ్యాఖ్యలు..
న్యూఢిల్లీ: యమునా నదీ శుద్దీకరణపై ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2025లో కాకుండా వచ్చే ఏడాది చివరికల్లా నదిని సంపూర్ణంగా శుద్ది చేస్తామని మంగళవారం అన్నారు. అసోచామ్ సంస్థ నిర్వహించిన వర్చువల్ సెషన్‌లో ఆయన మాట్లాడారు. ఢిల్లీలోని మొత్తం మురుగునీటిని వచ్చే ఆరు నెలల్లో ట్యాప్ చేస్తామని అన్నారు. అంతేకాకుండా వచ్చే 15 నెలల్లో అన్ని ప్రాంతాలు మురుగునీటి నెట్‌వర్క్‌తో అనుసంధానించబడతాయని తెలిపారు. 'మేము 2023 డిసెంబర్ కల్లా యమునా పూర్తి స్థాయిలో శుద్ధీకరణ చేస్తాం. 2025లో కాదు. అన్ని డ్రైన్‌లు పూర్తిగా శుభ్రం చేయబడుతాయి. నేను సంసిద్ధంగా ఉన్నాను. మరి కొన్ని రోజుల్లో మేము మిమ్మల్ని ఢిల్లీలోని నదిలో ఎక్కడైనా మునిగేందుకు ఆహ్వానిస్తాం' అని అన్నారు. త్రాగునీటి లభ్యతను పెంచేందుకు ఢిల్లీ మురుగునీటి శుద్ధీకరణను రోజుకు 1,000 మిలియన్ గ్యాలన్లు చేసేలా సామర్ధ్యాన్ని పెంచుతామని తెలిపారు. ఢిల్లీలో రోజుకు 1,150 మిలియన్ గ్యాలన్ల నీరు అవసరముండగా, కేవలం 935 మిలియన్ గ్యాలన్లు మాత్రమే సరఫరా చేస్తుంది.