- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
44 ఏళ్ల ప్రయాణానికి యమహా గుడ్ బై.. కస్టమర్లే కారణం అని ప్రకటన..
దిశ, వెబ్‌డెస్క్: యమహా ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించుకున్న సంస్థ. అయితే తాజాగా ఈ సంస్థ తీసుకున్న నిర్ణయం అందరినీ షాక్‌కు గురిచేసింది. ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా జరిగే 'దాకర్ ర్యాలీ' నుంచి యమహా తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. గత 44 ఏళ్లగా యమహా ఈ ఛాంపియన్ షిప్‌లో పాల్గొంటోంది. ఒక్కసారిగా దీని నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో బైక్ స్టంట్ అభిమానులు నిరాశ చెందారు. అంతేకాకుండా ఈ ఏడాది దేశ వ్యాప్తంగా జరగనున్న ఏ ఎఫ్ఐఎం ఛాంపియన్ షిప్ పోటీల్లోనూ పాల్గొనడం లేదని అనౌన్స్ చేసింది.
'దాకర్ ర్యాలీ' ప్రారంభం నుంచి ప్రతి ఏటా పాల్గొన్న సంస్థ యమహా ఒక్కటే కావడం విశేషం. ఇప్పుడు ఇది కూడా ఈ ర్యాలీ నుంచి తప్పుకోవడం అందరినీ షాక్‌కి గురిచేస్తోంది. ఈ సందర్భంగా సంస్థ అధికారులు మాట్లాడుతూ.. ' మా ఆఫ్ రోడ్ కస్టమర్లు మా నుంచి మరింత కొత్తదనాన్ని ఆశిస్తున్నారు. సరికొత్త ప్రొడక్ట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. వారితో కనెక్టై ఉండాలంటే వారి కోరికలు మేము తీర్చాలి. మేము దాకర్ ర్యాలీ నుంచి తప్పుకోవడానికి ఇదే ప్రథమ కారణం' అని యూరప్ యమహా ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎరిక్ దె సెయినస్ తెలిపారు.