world's Tallest Family: ప్ర‌పంచంలో అత్యంత ఎత్తైన ఫ్యామిలీ ఇదే..! (వీడియో)

by Sumithra |   ( Updated:2023-03-30 16:31:09.0  )
worlds Tallest Family: ప్ర‌పంచంలో అత్యంత ఎత్తైన ఫ్యామిలీ ఇదే..! (వీడియో)
X

దిశ‌. వెబ్‌డెస్క్ః world's Tallest Family| కాస్త హైట్ త‌క్కువ‌గా ఉంటే విప‌రీతంగా బాధ‌ప‌డ‌తారు చాలా మంది. మ‌రీ ఎత్తుగా ఉండ‌టం కూడా న‌చ్చ‌దు అంద‌రికి. క‌రెక్ట్ హైట్ ఉండాల‌ని భావిస్తారంతా. అస‌లు ఆ 'క‌రెక్ట్‌'కి అర్థం ఏంటో..?! బ‌హుశా, ఆ స‌మాజంలో ఎక్కువ మంది ఏది 'క‌రెక్ట్' అంటే అదే అస‌లైన క‌రెక్టేమో..? కానీ, ఈ కుటుంబం మాత్రం ఎత్తుగా ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నారు. దాని వ‌ల్ల వ్య‌క్తిగతంగా కొన్ని ఇబ్బందులు ఉన్న‌ప్ప‌టికీ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కుటుంబంగా గుర్తింపు రావ‌డం ఎంతో సంతోషంగా ఉంద‌ని అంటున్నారు. అమెరికాలోని మిన్నెసోటాలోని ఎస్కోలో నివ‌శిస్తున్న ఈ 'ట్రాప్' కుటుంబం ఇప్ప‌టి వ‌ర‌కూ ఉన్న అన్ని రికార్డుల‌ను బ‌ద్ద‌లుకొట్టి, ప్ర‌పంచంలోనే అత్యంత ఎత్తైన ఫ్యామిలీగా గిన్నీస్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుంది.

ఈ ఐదుగురు కుటుంబ సభ్యుల సగటు ఎత్తు 203.29 సెం.మీ. (6 అడుగుల‌ 8.03 అంగుళాలు). ఇక‌, ఈ కుటుంబంలోని ఐదుగురు సభ్యుల ఎత్తును కలిపితే, టెన్నిస్ కోర్టులో సగం ఉంటుంది మ‌రి. ఎత్తుగా ఉండ‌టం వ‌ల్ల‌ కుటుంబంలోని స్కాట్, క్రిస్సీ, సవన్నా, మోలీ, ఆడమ్‌లు వివిధ రకాల క్రీడల్లో చురుకుగా పాల్గొంటున్నారు. బాస్కెట్‌బాల్, వాలీబాల్ ప్లేయ‌ర్లుగా కాలేజీల్లో ఆడారు. వీళ్ల కుటుంబం గురించి మ‌రిన్ని విశేషాలు చెబుతున్న ఓ వీడియోను గిన్నీస్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్ త‌న ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. అంద‌రూ 'ఔరా.. ఇంత హైటా..!' అంటూ ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

Advertisement

Next Story