- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పులి పునఃసృష్టి.. ప్రయత్నాలు ప్రారంభించిన సైంటిస్టులు
దిశ, ఫీచర్స్ : ఆస్ట్రేలియాలో అంతరించిపోయిన జీవజాతి 'టాస్మానియన్ టైగర్'ను పున:సృష్టించేందుకు మెల్బోర్న్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. థైలాసిన్ ఇంటిగ్రేటెడ్ జెనెటిక్ రీస్టోరేషన్ రీసెర్చ్(TIGRR) ల్యాబ్‌లో ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. అంతరించిపోతున్న జీవజాతులను సంరక్షించేందుకు కీలకమైన సాధనాలను అభివృద్ధి చేస్తూనే టాస్మానియన్ పులిని తిరిగి తీసుకురావడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యమని టీమ్‌ను లీడ్ చేస్తున్న మార్సుపియల్ ఎవల్యూషనరీ బయాలజిస్ట్, టాస్మానియా టైగర్ ఎక్స్‌పర్ట్ ఆండ్రూ పాస్క్ పేర్కొన్నారు. ఈ ప్రయోగం కనుమరుగయ్యే దశలో ఉన్న ఇతర మార్సుపియల్ జాతి జీవులను రక్షించడంలోనూ సాయపడుతుందన్నారు.
థైలాసిన్‌కు తిరిగి జీవం పోసేందుకు తొమ్మిది కీలక దశలను ప్రతిపాదించిన పాస్క్ అండ్ టీమ్.. దీని జన్యుక్రమాన్ని గుర్తించడం కీలక పురోగతిలో ఒకటని వివరించారు. ఈ జీవిని మళ్లీ ఎలా సృష్టించాలనే దానిపై పూర్తి బ్లూప్రింట్ అందించినట్లు తెలిపారు. టాస్మానియా ఆవాసాలు పెద్దగా మారలేదని, థైలాసిన్‌ను తిరిగి ప్రవేశపెట్టడానికి ఇది సరైన వాతావరణాన్ని అందిస్తుందని వివరించారు. టాస్మానియన్ పునఃప్రవేశం పర్యావరణ వ్యవస్థకు ప్రయోజనకరంగా ఉంటుందన్న శాస్త్రవేత్తలు.. ఈ పులి సంతతికి చెందిన 'డన్నార్ట్' జన్యు కణాలు ఆ జాతిని పునరుద్ధరించేందుకు సాయపడతాయని తెలిపారు.
'జంతువు జన్యువుపై మరింత అవగాహన పెంచుకోవడం, పిండాన్ని తయారు చేయడానికి సాంకేతికతలను అభివృద్ధి చేయడం, ఆ పిండాన్ని సరోగేట్ హోస్ట్‌గా బదిలీ చేయడం' ద్వారా టాస్మానియాను తిరిగి తీసుకురాగలమని వివరించారు. కాగా ఒకప్పుడు ఆస్ట్రేలియాలో విస్తృతంగా ఉండే థైలాసిన్.. యూరోపియన్ల వలసల తర్వాత, టాస్మానియా ప్రాంతానికి మాత్రమే పరిమితమయ్యాయి. చివరగా టాస్మానియన్ పులి 1936లో చనిపోయినట్లు తెలుస్తోంది.