అనుకున్నదాని కన్నా నెమ్మదిగానే.. చైనాతో చర్చలపై విదేశాంగ మంత్రి జైశంకర్

by Vinod kumar |
అనుకున్నదాని కన్నా నెమ్మదిగానే.. చైనాతో చర్చలపై విదేశాంగ మంత్రి జైశంకర్
X

న్యూఢిల్లీ: ఇరు దేశాల మధ్య బంధాల గురించి ప్రస్తావిస్తూ.. పనులు కొనసాగుతున్నాయని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. శుక్రవారం భారత్ కు వచ్చిన చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ఆయన సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు సాధారణంగా లేవని అన్నారు. సరిహద్దు ఘర్షణలే దీనికి కారణమని చెప్పారు. భారత్ చైనాల మధ్య బంధాలు అనుకున్న దాని కన్నా నెమ్మదిగా కొనసాగుతున్నాయని తెలిపారు. '2020 ఏప్రిల్ నుంచి చైనా బలగాల మోహరింపుతో సరిహద్దుల్లో ఘర్షణ, ఉద్రిక్తతలు నెలకొన్నాయి.


శాంతి, ప్రశాంతత పునరుద్ధరణకు చర్చలలో పూర్తి వ్యక్తీకరణను కనుగొనాలి. మా ప్రయత్నాలు పూర్తిగా సమస్యలు తొలగిపోవడం పైనే ఉన్నాయి. అని అన్నారు. చైనా సరిహద్దుల్లో చేస్తున్న చర్యలతో ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం ఉందని తెలిపారు. ఇప్పటికే ఇరు దేశాల మిలిటరీ కమాండర్లు 15 దఫాలుగా సరిహద్దు అంశంపై చర్చలు జరిపిన ఆశించిన ప్రయోజనం లేకపోయింది. అంతేకాకుండా ఉక్రెయిన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఉగ్రవాదం వంటి విషయాలు కూడా సమావేశంలో ప్రస్తావించారు.

సైనిక బలగాలు వెనక్కి తీసుకోవాలి..

సరిహద్దుల్లో మోహరించిన దళాలను వీలైనంత త్వరగా వెనక్కి తీసుకోవాలని విదేశాంగ మంత్రి వాంగ్ యికి జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ తెలిపారు. దీంతో చర్చలు సాధారణ స్థితికి చేరుకుంటాయని అన్నారు. చర్యలు సమాన, పరస్పర భద్రత యొక్క స్ఫూర్తిని ఉల్లంఘించకూడదని నొక్కి చెప్పారు. ప్రస్తుత పరిస్థితులు కొనసాగించడం పరస్పర ఉద్దేశం కాదని తెలిపారు. 'శాంతి, ప్రశాంతత పునరుద్ధరణ కోసం దౌత్య, సైనిక స్థాయిలలో సానుకూల పరస్పర చర్యలను కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఇది పరిస్థితులు సాధారణీకరించడానికి అవసరం' అని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed