ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం.. యువతి గర్భం దాల్చడంతో..

by S Gopi |
ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం.. యువతి గర్భం దాల్చడంతో..
X

దిశ, వెబ్ డెస్క్: ప్రియుడు తనని మధ్యలో వదిలివేయడంతో మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరువళ్లూరు జిల్లాకు చెందిన ఓ యువకుడికి వివాహమైంది. అయితే, అతను కోయంబేడులోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో టీ హోటల్ లో పనిచేసే ఓ యువతి అతడికి పరిచయమైంది. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఆ తర్వాత వారిద్దరూ ఇంటి నుంచి పారిపోయారు. విషయం తెలుసుకున్న అతడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు వీరిద్దరూ పాండిచ్చేరిలో ఉన్నట్లు గుర్తించారు. అనంతరం అక్కడికి వెళ్లి వారిద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చి ఎవరి ఇంటికి వారిని పంపించారు. అప్పటి నుంచి అతను భార్యతో ఉంటున్నాడు. అయితే, తీవ్ర మనస్తాపానికి గురైన ఆ యువతి అతని ఇంటి వద్దకు వెళ్లి తాను గర్భవతిని అని, తనతో రావాలని కోరింది. అయితే, అతను ఆమెతో వెళ్లేందుకు నిరాకరించాడు. దీంతో ఆ యువతి తీవ్ర మనస్తాపానికి గురై తనతో తెచ్చుకున్న పెట్రోల్ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుంది. స్థానికులు గమనించి మంటలార్పి ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆ యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story