- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పక్కింటి వ్యక్తితో ఎఫైర్.. శృంగార వీడియో చూపిస్తూ రోజూ..
దిశ, వెబ్ డెస్క్: నగ్నంగా ఉన్న వీడియోను చూపిస్తూ కామవాంచ తీర్చాలని వేధిస్తున్న ప్రియుడిని ప్రియురాలు హత్య చేసింది. ప్రియురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్ లోని కర్దాని ఏరియాకు చెందిన ఓ వివాహిత తన పక్కింటి వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. గత రెండేళ్లగా వారిద్దరూ వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. అయితే, వారి మధ్య గొడవలు జరగడంతో ఆమె అతడిని దూరం పెడుతూ వచ్చింది. అతను మాత్రం ఆగ్రహంతో ఆమె భర్త లేని సమయంలో ఇంట్లోకి వెళ్లి తన కోరిక తీర్చాలని వేధించేవాడు. అందుకు ఆమె నో చెప్పింది. అయితే, వారిమధ్య ఇంతకుముందు జరిగిన శృంగార వీడియోను ఆమెకు చూపిస్తూ బెదిరించాడు. ఆ సమయంలో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆమె అతడిని గొంతు నులిమి హత్య చేసింది. ఆ తర్వాత ఆమె అక్కడి నుంచి తనకేమీ తెలియనట్టుగా వెళ్లిపోయింది. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహం వద్ద ఉన్న సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకుని పరిశీలించారు. అందులో ఉన్న వీడియోను చూసి పోలీసులు ఆమెను ప్రశ్నించారు. దీంతో ఆమె అసలు విషయం ఒప్పేసుకుంది. అనంతరం ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.