- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అవసరమైతే యోగి మోడల్‌ను అనుసరిస్తాం: సీఎం
దిశ, వెబ్‌డెస్క్: అవసరమైతే ఉత్తరప్రదేశ్‌లో సీఎం యోగి అవలంభిస్తున్న పద్దతిని రాష్ట్రంలో అనుసరిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజు బొమ్మై అన్నారు. రాష్ట్రంలో మతోన్మాద శక్తులను ఎట్టి పరిస్థితుల్లో ఎదుర్కొంటామని, వాటిని అణచివేసేందుకు యోగి మోడల్‌ను అనుసరించేందుకు ఏమాత్రం ఆలోచించమని బస్వరాజ్ అన్నారు. 'కర్ణాటకలో మతోన్మాద శక్తులను అణచివేసేందుకు అనేక యంత్రాంగాలు ఉన్నాయి. కానీ, అవసరం వస్తే.. యోగి మోడల్ రాష్ట్రంలో ప్రవేశ పెడతాం' అని బొమ్మై అన్నారు. అయితే, రాష్ట్రంలో బీజేపీ యువమోర్చా నేతను ఇద్దరు వ్యక్తులు హత్య చేశారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో సీఎం వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తైన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బొమ్మై పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం యూపీలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా యోగి సరైన నిర్ణయాలు తీసుకుంటున్నారని బొమ్మై అన్నారు.