Allu Arjun: వైల్డ్ ఫైర్ ‘పుష్ప-2’ మూవీ సెన్సార్ పూర్తి.. ఏ సర్టిఫికెట్ వచ్చిందంటే? (ట్వీట్)

by Hamsa |   ( Updated:2024-11-30 13:59:22.0  )
Allu Arjun: వైల్డ్ ఫైర్ ‘పుష్ప-2’ మూవీ సెన్సార్ పూర్తి.. ఏ సర్టిఫికెట్ వచ్చిందంటే? (ట్వీట్)
X

దిశ, సినిమా: సుకుమార్, అల్లు అర్జున్(Allu Arjun) కాంబోలో రాబోతున్న ఇండియన్ బిగ్గెస్ట్ మూవీ ‘పుష్ప-2’(Pushpa 2: The Rule). అయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ‘పుష్ప’కు సీక్వెల్‌గా రాబోతుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్‌గా నటిస్తుండగా.. దీనిని మైత్రీ మూవీ మేకర్స్(Mythri movie makers) బ్యానర్‌పై ఫేమస్ ప్రొడ్యూసర్స్ నవీన్ ఎర్నేని(Naveen Erneni), యలమంచలి రవిశంకర్‌లు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న విడుదల కాబోతుంది.

అయితే ‘పుష్ప-2’ మూవీ కోసం ప్రేక్షకులతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న పుష్ప-2 మూవీ మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసి వరుస అప్డేట్స్‌ను రిలీజ్ చేస్తూ అంచనాలను పెంచుతున్నారు. ఇప్పటికే ఇందులోంచి వచ్చిన అప్డేట్స్ అన్ని సూపర్ రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ఈ క్రమంలో.. తాజాగా, వైల్డ్ ఫైర్ ‘పుష్ప-2’ సెన్సార్(Censor) పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు యూఏ(UA) సర్టిఫికెట్ వచ్చినట్లు తెలుపుతూ అల్లు అర్జున్ ఓ ట్వీట్ చేశారు. అయితే ఇందులోని మూడు పదాలు.. రెండు సీన్స్‌ను కట్ చేసినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed