ఛీ.. వీడు భర్తేనా..? ప్రకృతికి విరుద్ధంగా శృంగారం చేస్తూ..

by S Gopi |   ( Updated:2022-03-27 03:07:08.0  )
ఛీ.. వీడు భర్తేనా..? ప్రకృతికి విరుద్ధంగా శృంగారం చేస్తూ..
X

దిశ, వెబ్ డెస్క్: ప్రతిరోజూ ప్రకృతికి విరుద్ధంగా శృంగారం చేస్తూ భార్యను వేధించేవాడు. దీంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది. అయినా కూడా అతను ఏ మాత్రం కనికరం చూపకుండా మృగంలా ప్రవర్తిస్తూ తన కోరికను తీర్చుకునేవాడు. వద్దని నిరాకరిస్తే చిత్రహింసలకు గురి చేసేవాడు. ఆ టార్చర్ ను తట్టుకోలేక భర్తను హత్య చేసింది. ఈ సంఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్ లోని భరత్ పూర్ కు చెందిన వ్యక్తికి వివాహమైంది. అయితే, అతను శృంగారం విషయంలో భార్యను ప్రతిరోజూ వేధించేవాడు. ఆమెతో ప్రతిరోజూ ప్రకృతికి విరుద్ధంగా శృంగారం చేసేవాడు. దీంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది. అయినా కూడా అతను ఏ మాత్రం కనికరం చూపించేవాడు కాదు. ఆమె వద్దు అని నిరాకరిస్తే పశువులా మారి చిత్రహింసలకు గురి చేసేవాడు. దీంతో ఆమె ఆరోగ్యం మరింతగా క్షీణించింది. ఈ టార్చర్ ను తట్టుకలేక ఆమె తన భర్తను హత్య చేయాలని నిర్ణయించుకుంది.

ఈ క్రమంలో ఒకరోజు భర్త తాగొచ్చి ఆమెతో ప్రకృతికి విరుద్ధంగా శృంగారం చేశాడు. ఆరోగ్యం బాగాలేకున్నా అతడికి సహకరించింది. ఆ తరువాత అతడికి నిద్రమాత్రలు కలిపిన భోజనం పెట్టింది. దీంతో అతను నిద్రలోకి జారిపోయాడు. ఆ తర్వాత అతడి ముఖంపై దిండు పెట్టి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసింది. ఆ తర్వాత అతడి గొంతును కత్తితో కోసింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. అనంతరం ఆమెను అరెస్ట్ చేశారు. అయితే.. విచారణ సమయంలో పోలీసులు.. భర్తను ఎందుకు చంపావు అని ఎన్నిసార్లు అడిగినా ఆమె నోరు విప్పలేదు. ఏంటని ఆరా తీస్తే ఆమె మానసిక స్థితి బాగాలేదని అర్థం చేసుకున్నారు. అనంతరం మానసిక వైద్యుడి పర్యవేక్షణలో ఆమెను ప్రశ్నించారు. తన భర్త పెట్టే విపరీతమైన చిత్రహింసల వల్లే అతడిని హత్య చేసినట్లు చెప్పింది. ఇది విని పోలీసులు షాకయ్యారు. ప్రస్తుతం ఆమెకు ఆస్పత్రిలో మానసిక చికిత్స అందిస్తున్నారని సమాచారం.

Advertisement

Next Story

Most Viewed