ప్రాణం తీసిన జీన్స్ ప్యాంట్..

by Manoj |
ప్రాణం తీసిన జీన్స్ ప్యాంట్..
X

దిశ, వెబ్‌డెస్క్: భార్యాభర్తలు అన్నాక గొడవలు రావడం సహజం. ప్రస్తుతం దంపతులకు అర్ధం చేసుకునే మనస్తతత్వాలు లేకుండా పోయాయి. చిన్న చిన్న విషయాలకు విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారు. ఎంతటి దారుణాలకైనా తెగబడుతున్నారు. ఇలాంటి ఘటనే జార్ఖండ్‌లో చోటుచేసుకుంది.

వివరాళ్లోకి వెళితే.. జార్ఖండ్‌లోని జోర్భితా గ్రామానికి చెందిన దంపతులు గోపాల్‌పూర్ గ్రామంలో జరిగే జాతర చూసేందుకు వెళ్లారు. అయితే ఇంటికి వచ్చాక భార్య వస్త్రధారణపై దంపతుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పెళ్లి తర్వాత జీన్స్ ఎందుకు ధరించావు అనడంతో ఇద్దరి మధ్య గొడవ అయింది. మాటా మాటా పెరిగి ఆవేశానికి గురైన భార్య పుష్ప హెంబ్రోమ్ భర్తపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. దాంతో అది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతను మరణించాడు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. తన కొడుకుని కత్తితో పొడిచి కోడలు చంపినట్టు మృతుడు తండ్రి ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story

Most Viewed