- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BSP జిల్లా అధ్యక్షుడి భార్య మిస్సింగ్.. ఇందులో పెద్ద వాళ్ల హస్తం ఉందంటూ సెల్ఫీ వీడియో
దిశ, తాండూరు: భార్య ఆచూకీ లభించలేదని పిల్లలతో పాటు భర్త అజ్ఞాతంలోకి వెళ్లిన ఘటన తాండూరు పట్టణంలో కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. పట్టణానికి చెందిన దొరాశెట్టి సత్యమూర్తి బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఆయన భార్య అన్నపూర్ణ గత 5 నెలల క్రితం ఇంట్లో నుండి వెళ్ళిపోయింది. బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో రెండ్రోజుల తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆచూకీ తెలిపిన వారికి రూ.5 లక్షల బహుమానం కూడా ప్రకటించారు. అయినా, భార్య ఆచూకీ విషయంలో ఎలాంటి సమాచారం లేకపోవడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తూ.. పిల్లలతో పాటు భర్త ఓ వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ''అమ్మా.. ఎక్కడున్నావమ్మా'' అంటూ ఆ వీడియోలో చిన్నారులు రోధించడం అందరినీ కలచివేస్తోంది.
ఈ క్రమంలో పోలీసులకు సత్యమూర్తి డెడ్‌లైన్ పెట్టారు. 48 గంటల్లో తన భార్య ఆచూకీ కనిపెట్టాలని, లేకపోతే తాను పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని వీడియోలో పోలీసులకు డెడ్‌లైన్ పెట్టారు. అంతేగాక, ఇందులో పెద్దవాళ్లు ఇన్వాల్వ్ అయి ఉన్నారని అనడం, పక్కా ప్లాన్‌తోనే ఇంటినుంచి వెళ్లిపోయిందని చెబుతుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. తన భార్య అన్నపూర్ణ మిస్సింగ్ కేసు వెనకాల పెద్ద కుట్రే ఉందని స్వయంగా భర్త సత్యమూర్తే చెప్పడంతో జిల్లా వ్యాప్తంగా ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. విషయం తెలిసి అప్రమత్తమైన పోలీసులు గాలిస్తున్నారు. 48 గంటల్లో ఆచూకీ కనిపెడతారో లేదో వేచి చూడాలి.