హనీమూన్‌లో భార్య రచ్చ రచ్చ.. ఆమెకే వత్తాసు పలికిన కోర్టు

by Javid Pasha |
హనీమూన్‌లో భార్య రచ్చ రచ్చ.. ఆమెకే వత్తాసు పలికిన కోర్టు
X

దిశ, వెబ్‌డెస్క్: కొత్తగా పెళ్లైన జంట. హాయిగా హనీమూన్‌కి వెళ్లారు. తీరా చూస్తే భార్యకు భర్త భారీ షాక్ ఇచ్చాడు. వెంటనే తనను భర్త మోసం చేశాడంటూ భార్య పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భార్య, భర్త ఇద్దరూ ఎన్నో ఊహలతో హనీమూన్‌కి వెళ్లారు. కానీ అక్కడ అతడి ఫోన్ చెక్ చేస్తుండగా భార్యకు షాకింగ్ విషయం తెలిసింది. తన భర్త సంసారానికి పనికిరాడని, ఆ విషయం తనకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడని బాధితురాలు తెలిపింది. అయితే శృంగారం పట్ల అతడి అభిప్రాయం, ఇష్టాయిష్టాలు తెలుసుకునేందుకు అతడి ఫోన్ చూశానని, అప్పుడే తనకు ఈ విషయం తెలిసిందని ఆమె తెలిపింది. ఈ క్రమంలోనే కొందరు వ్యక్తులతో తన భర్త చేసిన చాట్ చూశాక తనకు అసలు విషయం అర్థమైందని ఆమె వెల్లడించింది. అయితే ఈ కేసులో భర్త ముందస్తు బెయిల్‌కు దాఖలు చేసిన పిటిషన్‌ను మహారాష్ట్ర థానే కోర్టు తిరస్కరించింది.

Advertisement

Next Story

Most Viewed