- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
History Of July 25: రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం జులై 25 నే ఎందుకు?
దిశ, వెబ్‌డెస్క్ : What is Significance of July 25th in The History Of President Of India| భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో ముర్ము చేత సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణం చేయించారు. అయితే ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము చరిత్రను లిఖించారు. జులై 25వ తేదిన ప్రమాణ స్వీకారం చేసిన 10వ రాష్ట్రపతిగా ఆమె రికార్డుకెక్కారు. భారత రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం ప్రతిసారి జులై 25వ తేదీనే జరుగుతోంది. ఇలా గత 45 ఏళ్లుగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. తొలి సారిగా జులై 25న ప్రమాణం స్వీకారం చేసింది నీలం సంజీవరెడ్డి. 1977 జులై 25న 6వ రాష్ట్రపతిగా నీలం సంజీవ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుండి అదే సాంప్రదాయం కొనసాగుతూ వస్తోంది.
సంజీవ రెడ్డి అనంతరం ఆ బాధ్యతలు చేపట్టిన జ్ఞాని జైల్ సింగ్ నుంచి, ఆర్.వెంకటరామన్, శంకర్ దయాళ్ శర్మ, కేఆర్ నారాయణన్, ఏపీజే అబ్దుల్ కలాం, ప్రతిభా దేవి సింఘ్ పాటిల్, ప్రణబ్ ముఖర్జీతో పాటు నిన్న పదవీ విరమణ చేసిన రామ్ నాథ్ కోవింద్ వరకు అందరూ జులై 25న నే ప్రమాణ స్వీకారం చేస్తూ వస్తున్నారు. అంతకు ముందు 1950 జనవరి 26న రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం 1952లో జరిగిన ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. 1957లోనూ మరోసారి ఆయనే ఎన్నిక అయ్యారు. 1962 లో సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. అయితే ఆ తర్వాత రాష్ట్రపతిగా పని చేసిన వారిలో కొందరు పూర్తి కాలం పదవిలో కొనసాగలేదు. 1967 మే 13న రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన డాక్టర్ జాకీర్ హుస్సేన్ మే 1969లో మరణించారు. వీవీ గిరి, తర్వాత ఫకృద్ధీన్ అలీ అహ్మాద్ సైతం పదవీ కాలం పూర్తి చేయలేకపోయారు. అనంతరం 1977 జులై 25న నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతిగా ప్రమాణం చేశారు. అప్పటి నుండి ఐదేళ్ల పదవి కాలం ముంగించుకుని జులై 24న పదవీ విరమణ చేయడం, జులై 25న బాధ్యతలు తీసుకోవడం ఇలా గత 45 ఏళ్లుగా కొనసాగుతోంది. తాజాగా ద్రౌపది ముర్ము కూడా ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ జులై 25న ప్రమాణం చేశారు.
ఇది కూడా చదవండి: మోడీ క్రాప్‌డ్ వీడియో షేర్ చేసిన ఆప్.. రెడ్ సిగ్నల్ ఇచ్చిన ట్విట్టర్..