- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సొసైటీకి హానికరమైన కంటెంట్.. చెక్ పెట్టే విధానం ఇదే?
దిశ, ఫీచర్స్ : సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు ప్రకటించడానికి కొద్దిసేపటి ముందు, మైక్రోసాఫ్ట్ కోఫౌండర్ బిల్ గేట్ బరువు పెరగడం గురించి 'జోక్' చేస్తూ టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ ఓ ట్వీట్ చేశాడు. వెంటనే 'షాడో బ్యాన్ కౌన్సిల్ నా ట్వీట్‌ను రివ్యూ చేస్తున్నాయి' అంటూ సదరు ట్వీట్‌లోని రహస్యాన్ని చేధించేందుకు ఆరుగురు వ్యక్తులు చర్చిస్తున్న ఓ ఫొటోను పంచుకున్నాడు. దీంతో చాలామంది నెటిజన్లు అందులోని 'షాడో బ్యాన్' గురించి వెతకడం ప్రారంభించారు. నిజానికి షాడో బ్యాన్ విషయంలో ఎప్పటినుంచో చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ఎక్కువ మంది ఇండియన్ కంటెంట్ క్రియేటర్స్ 'షాడో బ్యానింగ్' ఎదుర్కొంటున్నారు. ఇది ఇంటర్నెట్ వినియోగదారుల్లో విస్తృత ఆందోళనగా మారింది. ఇంతకీ 'షాడో బ్యాన్' అంటే ఏమిటి? దీనివల్ల ఎవరికి నష్టం? ఎవరికి లాభం? ఆ విశేషాలు తెలుసుకుందాం.
పాలస్తీనా పౌరుల కోసం మాట్లాడినందుకుగానూ భారత స్వతంత్ర జర్నలిస్ట్ రానా అయ్యూబ్‌కు సంబంధించిన ఇన్‌స్టా ఎకౌంట్‌పై సదరు మెటా కంపెనీ షాడో బ్యాన్ విధించింది. ఈ క్రమంలోనే పాలస్తీనియన్-అమెరికన్ మోడల్ బెల్లా హడిడ్ గత నెలలో పాలస్తీనా అనుకూల పోస్ట్‌లు పెట్టడంతో 'షాడో బ్యాన్'కు గురైంది. దీంతో 'ఇది మానవ హక్కుల ఉల్లంఘన, పక్షపాత ధోరణి, అన్యాయమైన సెన్సార్‌షిప్' అని ఆమె పేర్కొంది. బ్లాక్ లైవ్స్ మ్యాటర్‌లోనూ ఎంతోమంది టిక్ టాకర్స్‌పై షాడో బ్యాన్ విధించారు. నిజానికి 80వ దశకంలోనే షాడో బ్యాన్ తొలిసారిగా ఉపయోగించగా, 2000ల ప్రారంభంలో మరోసారి తెరమీదకు వచ్చింది. బాట్, ట్రోల్స్, షిట్‌పోస్టర్స్ లేదా హానికరమని భావించే వారికి చెక్ పెట్టేందుకు దీన్ని ఉపయోగిస్తుండగా.. ప్రపంచవ్యాప్తంగా 'షాడో బ్యాన్' పదం మళ్లీ ఇటీవల ఎక్కువగా వినిపిస్తోంది. దీనికి పైన పేర్కొన్న సంఘటనలే కారణం. కాగా 'షాడో బ్యాన్' అంటే సోషల్ మీడియాలో ఒక వ్యక్తి/కమ్యూనిటీ లేదా అంశానికి సంబంధించిన రహస్య సెన్సార్‌షిప్ అని అర్థం. ఇది సైలెంట్‌గా ఆయా సోషల్ మీడియా పోస్ట్‌ల అభిప్రాయాలను మ్యూట్ చేస్తుంది. కంటెంట్‌ను సెన్సార్ చేసేందుకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఉపయోగించే ఈ మోడరేషన్ టెక్నిక్.. 'వ్యక్తిగత పోస్ట్, వినియోగదారుల అకౌంట్, హ్యాష్‌ట్యాగ్ లేదా మొత్తం కమ్యూనిటీ'.. ఇలా నెటిజన్లను రెచ్చగొట్టే అన్నింటిపై బ్యాన్ చేస్తుంది.
గోస్ట్ బ్యానింగ్ :
సోషల్ మీడియా పోస్ట్‌లను యూజర్ లేదా క్రియేటర్‌కు తెలియజేయకుండా తీసివేయడం, మ్యూట్ చేయడం లేదా ఫాలోవర్స్‌కు కనిపించకుండా హైడ్ చేయడం వంటి చర్యలు 'షాడో బ్యాన్' కిందకు వస్తాయి. ఒకరి మీద గోస్ట్ బ్యానింగ్ విధిస్తే ఇక వారి కంటెంట్‌ను ఎవరూ చూడలేరు కానీ షాడో బ్యాన్ చేసినప్పుడు, సందేశాలను పోస్ట్ చేయడం, కొత్త ఫాలోవర్స్‌ను యాడ్ చేసుకోవడం, ఇతర పోస్ట్‌లకు కామెంట్స్ చేయడం లేదా రిప్లయ్ ఇవ్వడం కొనసాగించవచ్చు. కానీ తమ సందేశాలు మాత్రం ఫీడ్‌లో కనిపించకపోవచ్చు, వారిచ్చే రిప్లయ్‌లు కూడా హైడ్ కావచ్చు. అంతేకాదు మీరొక పర్టిక్యులర్ టాపిక్ గురించి మాట్లాడుతుంటే.. ప్లాట్‌ఫామ్ సదరు అంశం గురించి ఎవరూ ఎక్కువగా మాట్లాడకూడదనుకుంటే, ఆ పర్టిక్యులర్ పోస్ట్‌లో మీరు పొందే రీచ్ మొత్తాన్ని తగ్గిస్తుంది. ఒకరకంగా ఇది కూడా ఒకరకమైన 'షాడో బ్యాన్'గానే వ్యవహరించొచ్చు. ఉదాహరణకు: బెదిరింపు గురించి ఏదైనా మాట్లాడినట్లయితే, Instagram ఆ రకమైన యూజర్‌పై షాడో బ్యాన్ విధిస్తుంది. ఆ కంటెంట్ ఎక్కువ మంది వ్యక్తులకు చేరువ కాకుండా ఉండటానికే ఈ ప్రయత్నం కాగా ఇలాంటి కంటెంట్ ద్వారా ప్రజలు తప్పుడు మార్గంలో ప్రభావితం కాకూడదని ఆయా ప్లాట్‌ఫామ్స్ భావించడమే ఇందుకు కారణం. షాడో బ్యాన్స్ విధించినట్లు ఆయా ప్లాట్‌ఫామ్స్ సదరు వ్యక్తులకు ఎలాంటి సమాచారం అందించవు, తమకు తాము తెలుసుకోవాల్సిందే.
ఇలాంటి కంటెంట్ ఉంటే ?
తీవ్రవాద గ్రూపులను ప్రశంసించడం, ఇతరుల వలె నటించడం, మైనర్‌లతో కూడిన లైంగిక కంటెంట్‌ను షేర్ చేయడం లేదా అబ్యూజ్(దుర్వినియోగం), వేధింపులు వంటి ప్రామాణిక మార్గదర్శకాలను అనుసరించకపోతే సోషల్ మీడియా కంపెనీలు ఆ కంటెంట్‌ను వెంటనే సెన్సార్ చేస్తాయి. నిషేధించబడటానికి ప్రమాణాలు పోర్టల్‌పై ఆధారపడి మారుతూ ఉంటాయి. అయితే సాధారణంగా కొంత మేరకు స్పామింగ్, అనుచితమైన ప్రవర్తన లేదా కాపీరైట్ ఉల్లంఘన వంటివి కూడా ఉంటాయి.
కొన్ని ఉదాహరణలు:
* సెర్చ్ బార్‌లో పర్టిక్యులర్ రిపబ్లికన్ల పేర్లను టైప్ చేసినప్పుడు సదరు వ్యక్తుల విజిబిలిటీని Twitter పరిమితం చేసిందని 2018లో ఒక వైస్ కథనం నివేదించింది.
* ఆస్ట్రేలియా బిగ్ బ్రదర్ VIP సెలబ్రిటీ సిరీస్‌లో కనిపించిన ఒలింపిక్ పతక విజేత కైట్లిన్ జెన్నర్.. మార్చిలో ఫాక్స్ న్యూస్‌కు కంట్రిబ్యూటర్‌గా సైన్ అప్ చేసిన తర్వాత ట్విట్టర్ ద్వారా షాడో బ్యాన్‌కు గురైంది.
* హాస్యనటుడు అరి షఫీర్ 2019లో ఇన్‌స్టాగ్రామ్ నుంచి షాడో బ్యాన్ ఎదుర్కొన్నాడు.
* 2019, 2020లో కొన్ని చిత్రాలు, వీడియోలను తొలగించకుండా హైడ్ చేసేందుకు ఇన్‌స్టాగ్రామ్ షాడో బ్యాన్ ఉపయోగించింది.
* మహిళా ఫ్రీలాన్సర్లు, కళాకారులు, సెక్స్ వర్కర్లు, కార్యకర్తలు న్యూ ఆడియన్స్‌ను చేరుకోకుండా, వారి ఫాలోవర్స్‌ను పెంచుకోకుండా ఇన్‌స్టా నిరోధించినట్లు ఒక పరిశోధనా కథనం నివేదించింది.
* బ్లాక్ లైవ్స్ మ్యాటర్ మూవ్‌మెంట్ చుట్టూ ఉన్న కంటెంట్ దాని అల్గారిథమ్ ద్వారా తక్కువ ప్రాధాన్యతనిస్తోందని నివేదించిన తర్వాత, 2020లో షాడో బ్యాన్‌ను ఉపయోగించినందుకు టిక్‌టాక్ నల్ల జాతి వినియోగదారులకు క్షమాపణ చెప్పింది. అంతేకాదు సాంకేతిక లోపం కారణంగా #BlackLivesMatter, #GeorgeFloyd ఉపయోగించి అప్‌లోడ్ చేసిన పోస్ట్‌లకు సున్నా వీక్షణలు వచ్చినట్లు తాత్కాలికంగా కనిపించిందని పేర్కొనడం గమనార్హం.
'వినియోగదారులు, ప్రచురించిన కంటెంట్ మధ్యవర్తులుగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ వ్యవహరించే బాధ్యతను తీసుకున్నందునా.. అవాంఛనీయమని భావించే కమ్యూనికేషన్స్ అణిచివేసే విధానాలు పాటించడం అవసరమే' అని సైన్స్ అండ్ టెక్ సీనియర్ రీసెర్చ్ అసోసియేట్ జెన్నిఫర్ కాబ్ పేర్కొంది.