- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రెయిన్ ట్యూమర్ ఎందుకొస్తుంది.. లక్షణాలు ఏంటి?
దిశ, ఫీచర్స్ : ఎఫెక్ట్‌తో సంబంధం లేకుండా ఎలాంటి ట్యూమర్‌కైనా భయపడటం సహజం. ప్రత్యేకించి బ్రెయిన్ ట్యూమర్స్ విషయంలో ఈ భయం ఇంకాస్త ఎక్కువుంటుంది. కానీ బ్రెయిన్స్ ట్యూమర్స్‌లో 80శాతం క్యాన్సర్ కారకాలు కాదని, కేవలం మెనింజ్యూమ(కామన్ బ్రెయిన్ ట్యూమర్) అని వైద్యులు చెప్తున్నారు. అయితే వాటిని త్వరగా నిర్దారించని పక్షంలో ప్రాణాపాయ స్థితి ఏర్పడవచ్చు. నిజానికి బ్రెయిన్ ట్యూమర్ ఎటువంటి లక్షణాలు చూపించదు. కానీ తరచూ తలనొప్పి, తల తిరగడంతో పాటు ట్యూమర్ సైజ్ పెరిగే కొద్దీ కొన్ని మరికొన్ని లక్షణాలను ప్రేరేపిస్తుంది.
బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు :
* ట్యూమర్ కంటి నరాలపై ఒత్తిడి తెచ్చినపుడు కంటి చూపులో తేడా వస్తుంది.
* ఇది కొన్నిసార్లు టెంపరల్ లోబ్‌లో ఉన్నట్టయితే వారి బిహేవియర్‌లో మార్పులు(వికారంగా, కోపం, చిరాకు) కనిపిస్తాయి.
* తలనొప్పి అధికమయ్యే కొద్దీ వాంతులు కంట్రోల్ కాకపోవడం వంటివి బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలే.
* క్రమంగా ఒక చేయి లేదా కాలు కదపలేని స్థితికి చేరుకుంటారు.
* ప్రతి 10 నుంచి 8 మందిలో(80%)వరకు ఫిట్స్ సంభవిస్తాయి. ఈ ఫిట్స్ బాడీ మొత్తాన్ని ప్రభావితం చేయొచ్చు.
అయితే, తలనొప్పి, ఫిట్స్ సమస్యలున్న ప్రతి ఒక్కరికీ బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్టు కాదని వైద్యులు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా స్ట్రెస్ వల్ల కూడా ఈ ట్యూమర్ వ్యాపించే అవకాశమున్నట్లు ఇటీవల నివేదికలు వెల్లడించాయి. అందుకే ఈ లక్షణాలతో బాధపడేవారు తక్షణమే డాక్టర్లను సంప్రదించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
దేని వల్ల సంభవిస్తుంది?
బ్రెయిన్ ట్యూమర్ ఎవరికి వస్తుందో అంచనా వేయడం కష్టతరమైన పని. అయితే ఇందులో పరిగణించాల్సిన కొన్ని ప్రమాద కారకాలు ఉన్నాయి. ముఖ్యంగా రేడియేషన్‌కు గురవడం వల్ల బ్రెయిన్‌లో ట్యూమర్ ఏర్పడవచ్చు. 'అయోనైజింగ్ రేడియేషన్‌గా పిలిచే ఒక రకమైన రేడియేషన్‌కు గురైన వ్యక్తుల్లో బ్రెయిన్ ట్యూమర్ ప్రమాదం ఎక్కువని ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు.