- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పీడియాట్రిక్లో ఆరోగ్య శ్రీ పెరగాలి.. ప్రతి వారం ఓ ఆసుపత్రిపై రివ్యూ: మంత్రి
దిశ, తెలంగాణ బ్యూరో: పీడియాట్రిక్విభాగంలో ఆరోగ్య శ్రీ రిజిస్ట్రేషన్లు పెరగాలని ఆరోగ్యశాఖ మంత్రి హరీష్రావు పేర్కొన్నారు. ప్రసూతి, ఆర్థోపెడిక్, జనరల్ సర్జరీల్లోనూ ఆరోగ్యశ్రీని ఎక్కువ మందికి వర్తింపజేయాలన్నారు. శనివారం వైద్య ,విద్య పరిధిలోని ఆసుపత్రుల పనితీరుపై ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, డీఎంఈ రమేష్ రెడ్డి, సీఎం ఓఎస్డీ గంగాధర్, అన్ని ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, ప్రిన్సిపాళ్లు, హెచ్‌వోడీలు, ఆర్ఎంవోలు, సీఎస్ ఆర్ఎంవోలు దీనిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆసుపత్రుల అభివృద్ధి కొరకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించుకొని ముందుకు వెళ్లాలన్నారు.
ఆపరేషన్ థియేటర్ల వినియోగం పెరగాలన్నారు. సీ సెక్షన్లను గణనీయంగా తగ్గించి , సాధారణ ప్రసవాలు ఎక్కువగా జరిగేలా చూడాలన్నారు. ఈఎన్టీ, డెర్మటాలజీ సేవలను మరింత మెరుగుపరచాలన్నారు. సమీప గ్రామాల్లో ఈఎన్టీ క్యాంపులు ఏర్పాటు చేసి సేవలు అందించాలన్నారు. ఇక నుంచి ప్రతి వారం ఓ ఆసుపత్రిపై రివ్యూ నిర్వహిస్తానని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. అత్యవసర సేవలు అన్ని వేళలా అందించేందుకు వీలుగా అనస్థీషియా విభాగం క్రియాశీలకంగా ఉండాలన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యంగా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు.