- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ధాన్యం కొనేదాకా కొట్లాడుతాం : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : రాష్ట్రంలోని వరి ధాన్యం కొనుగోలు చేసేవరకు కేంద్రంలోని బీజేపీ సర్కారుపై కొట్లాడుతామని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. తెలంగాణలో రైతులు యాసంగిలో పండించిన ధాన్యాన్ని పంజాబ్ తరహాలో కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ.. బుధవారం నాగ్ పూర్ జాతీయ రహదారిపై కడ్తాల్ జంక్షన్ వద్ద రైతులు, టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. జాతీయ రహదారిపై బైటాయించి రైతులను అరిగోస పెడుతున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతుల పక్షాన ధర్నా చేస్తున్న వారికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంఘీభావం తెలిపారు.
వరి ధాన్యం కొనుగోళ్ళలో కేంద్ర వైఖరికి నిరసనగా వరి గొలుసులను ప్రదర్శించి, నాగలి పట్టారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పండిన ప్రతీ గింజ కేంద్రం కొనుగోలు చేసేదాకా తెలంగాణ రైతుల పక్షాన టీఆర్ఎస్ ప్రభుత్వం పోరాటం చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని తెలిపారు. బాజాప్తా వరి వేయండి. మీ వడ్లను మేం కొనిపిస్తామన్న బీజేపీ నాయకులు తీరా పంట చేతికి వచ్చాకా మోహం చాటేస్తున్నారని మండిపడ్డారు. మండుటెండలో కూడా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి రైతుల పక్షన ధర్నా చేస్తున్నారని, ఇకనైనా కేంద్ర బీజేపీ సర్కార్ బుద్ధి తెచ్చుకుని కళ్ళు తెరవాలని సూచించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్ర బీజేపీ నాయకులు తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పి, వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ రహదారిపై బైటాయించి ప్రజలను ఇబ్బందులు పెట్టాలనే ఉద్దేశ్యం టీఆర్ఎస్ కు లేదని, ఇలాంటి నిరసన కార్యాక్రమాలతోనైనా కేంద్ర సర్కారుకు సెగ తగులుతుందని ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ఎమ్మెల్సీ దండే విఠల్, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా శ్యాం నాయక్, జిల్లా రైతు సమన్వయ సమితి చైర్మన్ నల్లా వెంకట్రామ్ రెడ్డి, రైతులు, ఇతర ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.