గవర్నర్ గవర్నర్‌లా వ్యవహరిస్తే తప్పకుండా గౌరవిస్తాం: KTR

by Mahesh |   ( Updated:2022-04-07 13:53:43.0  )
గవర్నర్ గవర్నర్‌లా వ్యవహరిస్తే తప్పకుండా గౌరవిస్తాం: KTR
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : గవర్నర్ అయ్యే వారు రాజకీయ నేపథ్యం ఉంటే పర్లేదు కానీ, ఎమ్మెల్సీ అయ్యేందుకు రాజకీయ నేపథ్యం అడ్డు వస్తుందా అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. గురువారం సిరిసిల్ల లో ఆయన మాట్లాడుతూ.. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ విషయంలో తాను అభ్యంతరం చెప్పినందుకే తనకు గౌరవం ఇవ్వడం లేదంటూ గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. గవర్నర్ అంటే తమకు చాలా గౌరవం ఉందన్నారు. రాజ్యాంగ వ్యవస్థల పట్ల గౌరవం ఉందని, నరసింహన్ ఉన్నప్పుడు ఏ పంచాయతీ లేదని.. వీరితో తమకు ఎందుకు ఉంటుందన్నారు. ఎవరిని ఎవరు అవమానించారు, ఎక్కడ అవమానించారు, ఎందుకు జరిగిందని అనుకుంటున్నారు వారు అసలు అంటూ ప్రశ్నించారు. గవర్నర్ వ్యవస్థ తో ఎంత గౌరవం ఉండాలో అంత గౌరవం ఇస్తామన్నారు.

ఎక్కడ అవమానం జరిగిందో చెప్తే తాము కూడా అర్థం చేసుకుంటామని, గవర్నర్ గవర్నర్‌లా వ్యవహరిస్తే తప్పకుండా గౌరవిస్తామని కేటీఆర్ వ్యాఖ్యానించారు. గవర్నర్ గౌరవానికి భంగం కలగలేదని, వారెందుకు ఊహించుకుంటున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారన్నారు. రాజ్యాంగబద్ధంగా వెళ్తున్నామని చెప్పారు. శాసనసభ సమావేశాలు మొట్టమొదటి సారి జరిగినప్పుడు గవర్నర్ ప్రసంగం ఉండాలని రాజ్యాంగంలో ఉంది, అది మొదటి సమావేశం కాదని, సమావేశం ప్రోరోగ్ కానందున గవర్నర్ ప్రసంగం లేదన్నారు. దానికి వారు అవమానంగా ఫీలయితే మేం చేయగలిందేమీ లేదన్నారు. కాబట్టి గవర్నర్ తమిళిసై మాట్లాడేప్పుడు ఆలోచించుకుని మాట్లాడితే మంచిదని కేటీఆర్ అన్నారు. లేనిపోని వివాదాన్ని బీజేపీనే సృష్టిస్తోందన్నారు.

Advertisement

Next Story

Most Viewed