- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
40 ఏళ్లుగా ఈ భూమి పైనే ఆధారపడ్డాం.. మాపై దయ చూపండి సార్..
దిశ, కంది: తాతల కాలం నుంచి ఈ భూమి పైనే ఆధారపడి జీవిస్తున్నమని ఈ విషయాన్ని గమనించి అధికారులు తమ గోడును విని తమకు చేయాలని భూ నిర్వాసితులు వేడుకుంటున్నారు.
ఉపాధి కోల్పోయి రోడ్డున పడతాం..
కొండాపూర్ మండలం మారేపల్లి గ్రామానికి చెందిన చాకలి రాములు, చాకలి గోపాల్, చాకలి వెంకయ్య కి గత 40 ఏళ్లుగా గంగారం రోడ్డు పక్కన సర్వే నెంబర్ 215 లో కొంత స్థలం ఉంది. వ్యవసాయం, ఇతర ఆధారాలు లేకపోవడంతో కొద్ది నెలల క్రితం కులవృత్తి కోసం రేకుల షెడ్డు వేసుకోవడం జరిగింది. అయితే పంచాయతీ కార్యదర్శి ద్వారా తమకు నోటీసులు ఇచ్చారని, కూల్చి వేస్తామని చెబుతున్నారని బాధితులు గురువారం వాపోయారు. ఇదే విషయమై గతంలో ఎంపీడీవో తో పాటు జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో వినతిపత్రాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తమపై దయతలచి ఉపాధి కోసం వేసుకున్న రేకుల షెడ్డు ను కూల్చి వేయకుండ న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.