- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విచిత్రం.. కొట్టకుండానే బోరు నుండి ఉబికి వస్తున్న జలధార
దిశ, అదిలాబాద్: దట్టమైన అడవి చుట్టూ కొండలు.. మధ్యలో ఊరు వేసవి సమీపిస్తున్న తరుణంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. కానీ ఓ చేతి పంపు కొట్టకుండానే జలధార ఉబికి వస్తున్నది. ఇది ఎక్కడో తెలుసుకోవాలని ఉందా.. అయితే ఆదిలాబాద్ కు రావాల్సిందే. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం దుబ్బగూడ గ్రామంలో విచిత్ర ఘటన ప్రజలను నివ్వెరపరుస్తోంది. చేతి పంపు నుండి నీళ్లు కావాలంటే దాని హ్యాండిల్ ను చేతులు నొప్పి పెట్టేలా కొట్టాల్సి ఉంది. ఆ తరహా బోరు ఇప్పుడు వేసినవి కాదు. ఈ ఫోటోలో మీరు చూస్తున్న బోరుకు మాత్రం అలాంటి అవసరం లేదు. ఎవరు కొట్టకుండానే పంపు నుంచి నీరు ఉబికి వస్తుంది. దుబ్బగూడ గ్రామంతోపాటు సమీప గ్రామాలకు సైతం ఈ బోరు దాహార్తి తీరుస్తుంది. కాగా.. జిల్లాలో వేసవి కాలం 40 నుంచి 48 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కొన్నిచోట్ల భూగర్భ జలాలు అడుగంటిపోయి తాగడానికి కూడా నీళ్లు దొరకని పరిస్థితి. కానీ, దశాబ్ధాల క్రితం వేసిన ఈ బోరు అడుగంటి పోవడం లేదు. ఏ కాలమైనా కొట్టకుండానే జలధార ఉబికి వస్తున్నది.