- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూ. 14,500 కోట్ల నిధుల సమీకరణకు వొడాఫోన్ ఐడియా బోర్డు ఆమోదం!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా రూ. 14,500 కోట్ల వరకు నిధుల సమీకరణ ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపినట్లు గురువారం ప్రకటించింది. ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన ప్రమోటర్లకు ఒక్కో షేర్ ధర రూ. 13.40 చొప్పున 338 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేసేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. ఈక్విటీ షేర్‌కు రూ. 13.30(ప్రస్తుతం షేర్ ధర కంటే రూ. 3.30 ప్రీమియంతో) ఇష్యూ ధరలో రూ. 10 ముఖ విలువ కలిగిన 338 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేయనున్నామని కంపెనీ ఎక్సైజ్ ఫైలింగ్‌లో పేర్కొంది. అదేవిధంగా ఈక్విటీ షేర్లు లేదంటే సెక్యూరిటీలను ఈక్విటీ షేర్లుగా మార్చేందుకు, గ్లోబల్ డిపాజిటరీ రసీదులు, అమెరికన్ డిపాజిటరీ రసీదులు విదేశీ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్లు, కన్వర్టబుల్ డిబెంచర్లు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ దశల్లో రూ. 10,000 కోట్ల వరకు వారెంట్లను జారీ చేయడానికి కూడా బోర్డు ఆమోదించింది. అంతేకాకుండా మార్చి 26న అసాధారణ సమావేశం (ఈజీఎం) ఏర్పాటుకు బోర్డు అంగీకరించింది. కాగా, గురువారం స్టాక్ మార్కెట్లలో వొడాఫోన్ ఐడియా షేర్ ధర 6 శాతం పెరిగి రూ. 11.08 వద్ద ట్రేడయింది.