- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యాదాద్రి దర్శన వేళల్లో మార్పు.. మార్చి 29 నుంచి అమలు
దిశ, యాదగిరిగుట్ట: ప్రపంచ స్థాయి పుణ్యక్షేత్రం గా రూపుదిద్దుకున్న యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ వేళలను దేవస్థాన అధికారులు.. అర్చకబృందం వెల్లడించారు.. ఆలయ ఉద్ఘాటన ఈ నెల 28న ప్రధానాలయ ఉద్ఘాటన, మహాకుంభ సంప్రోక్షణ, శాంతి కల్యాణోత్సవ పర్వాలు శ్రీవైష్ణవ పాంచరాతాగమ శాస్త్రరీతిలో కొనసాగనున్నాయి. అయితే ఆలయ ఉద్ఘాటన అనంతరం ఆలయ సందర్శనకు విచ్చేసే భక్తులకు గర్భగుడిలో కొలువుదీరిన స్వయం భువుల దర్శనాలు.. ఆలయంలో ప్రతి నిత్యం జరిపే ఆర్జిత సేవోత్సవ వేళలను దేవస్థాన ఈవో ప్రకటించారు. కాగా ఆలయ పునరిర్మాణంలో భాగంగా తాత్కాలిక బాలాలయంలో జరిపిన ఆర్జిత సేవలను మార్పు చేస్తున్నట్టు, ఆలయ పునర్నిర్మాణం అనంతరం స్వయంభువులు కొలువుదీరిన గర్భాలయంలో కొనసాగే నిత్య విధి కైంకర్యాలు.. ఆర్జిత సేవల సమయాలను ఆలయ ఈవో వెల్లడించారు. ఆలయ ఉద్ఘాటన అనంతరం స్వయంభువుల ఆలయంలో నిత్య పూజాకైంకర్యాలు కొనసాగుతాయి.
ఉదయం 3 గంటలకు ఆలయ తెరుచుట
+ ఉదయం 3గంటల నుంచి 3.30 గంటలకు సుప్రభాతం..
+ ఉదయం 3.30 గంటల నుంచి 4 గంటల వరకు బిందె తీర్థం.. ఆరాధన
+ ఉదయం 4గంటల నుంచి 4.30 గంటల వరకు స్వామివారికి బాలభోగం
+ ఉదయం 4.30 గంటల నుంచి 5.30 గంటల వరకు నిజాభిషేకం
+ఉదయం 5.30 గంటల నుంచి 5.45 గంటల వరకు అలంకార సేవ
+ఉదయం 5.45 గంటల నుంచి 6.30 వరకు స్వామివారికి సహస్రనామార్చన, ఆండాల్ అమ్మవారికి కుంకుమార్చన..
ఉదయం 6.30 గంటల నుంచి 8 గంటల వరకు సర్వ దర్శనాలు
ఉదయం 8గంటల నుంచి 9గంటల వరకు విఐపి బ్రేక్ దర్శనం
ఉదయం 9గంటల నుంచి 12 గంటల వరకు సర్వదర్శనాలు
మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.45 గంటల వరకు మాధ్యాహ్న రాజభోగము
మధ్యాహ్నం 12.45 గంటల నుంచి 4 గంటల వరకు సర్వ దర్శనాలు
సాయంత్రం 4గంటల నుంచి 5 గంటల వరకు విఐపి బ్రేక్ దర్శనం
సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు సర్వ దర్శనాలు
రాత్రి 7 గంటల నుంచి 7.30 గంటల వరకు తిరువారాధన
రాత్రి 7.30 గంటల నుంచి 8.15 గంటల వరకు స్వామివారికి సహస్రనామార్చన, ఆండాల్ అమ్మవారికి కుంకుమార్చన...
రాత్రి 8.15 గంటల నుంచి 9.15 గంటల వరకు సర్వదర్శనాలు.
రాత్రి 9.15 గంటల నుంచి 9.45 గంటల వరకు రాత్రి నివేదన. ఆరగింపు.
రాత్రి 9.45గంటల నుంచి 10గంటల వరకు శయనోత్సవ దర్శనం. ప్రధానాలయ ద్వార బంధనం.
+ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 9.15 గంటల వరకు జరిగే సర్వదర్శన వేళల్లో సువర్ణపుష్పార్చన, వేదాశీర్వచనం.
ఉదయం 8.30 గంటల నుంచి 10గంటల వరకు సుదర్శన నారసింహ హోమం.
ఉదయం 10.30 గంటల నుంచి 12 గంటల వరకు స్వామివారి నిత్య కల్యాణోత్సం.. బ్రహ్మోత్సవం.
సాయంత్రం 5గంటల నుంచి 6.30 గంటల వరకు స్వామివారి వెండి జోడు సేవోత్సవాలు
సాయంత్రం 6.45 గంటల నుంచి 7 గంటల వరకు దర్భారు సేవ
ప్రతీ మంగళవారం ఉదయం 8.30 గంటల నుంచి 11 గంటల వరకు విష్ణుపుష్కరిణి, ప్రధానాలయంలోని క్షేత్రపాలకుడికి నాగవల్లీ దళార్చనలు.
ప్రతీ శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఊంజల్ సేవోత్సవం.