- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Vishwak Sen: మాస్ కా దాస్ Mechanic Rocky హంగామా షురూ.. ఆసక్తికర పోస్ట్ పెట్టిన మూవీ టీమ్
దిశ, సినిమా: టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishwak Sen) ఫుల్ ఫామ్‌తో ఉన్నాడు. ప్రజెంట్ ఓ నాలుగు సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. విశ్వక్, రవితేజ ముళ్లపూడి(Ravi Teja Mullapudi) కాంబోలో ‘మెకానిక్ రాకీ’(Mechanic Rocky) తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary), శ్రద్ధా శ్రీనాథ్(Shraddha Srinath) హీరోయిన్లుగా నటిస్తుండగా.. ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి(Ram Talluri) నిర్మిస్తున్నారు. ఇప్పటికే ‘మెకానిక్ రాకీ’ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ అన్ని భారీ అంచనాలను పెంచాయి.
ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్, టీజర్, సాంగ్ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. అయితే ఈ చిత్రం నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో.. తాజాగా, ‘మెకానిక్ రాకీ’(Mechanic Rocky) మూవీ మేకర్స్ హవా షురూ చేశారు. రోజుకో ఈవెంట్‌కు హాజరై ప్రమోషన్స్ చేయనున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు. అంతేకాకుండా సెకండ్ ట్రైలర్, ప్రీ-రిలీజ్ ఈవెంట్ డేట్‌ను ప్రకటించారు.
16న మీమర్స్‌తో లంచ్, 17న వరంగల్‌లో ట్రైలర్ 2.0 లాంచ్, 18న తిరుమల దర్శనం, కాలేజీ విజిట్, 19న గోల్డెన్ ప్రెస్ పార్టీ, 20న ప్రీ-రిలీజ్(pre-release) ఈవెంట్, 21న ఏఎంబీ రెడ్ కార్పెట్ ప్రీమియర్ లను వేయనున్నట్లు పోస్ట్ ద్వారా వెల్లడించారు. ఇక ఈ విషయం తెలుసుకున్న మాస్ కా దాస్ అభిమానులు ఆనందపడుతున్నారు.
Throttling at fulll speed 💥#MechanicRocky ’s November is packed and how, get ready! 🤩🔥#MechanicRockyOnNOV22 🛠
— SRT Entertainments (@SRTmovies) November 9, 2024
'Mass ka Das' @VishwakSenActor @itsRamTalluri @RaviTejaDirects @Meenakshiioffl @ShraddhaSrinath @JxBe #RajaniTalluri @manojhreddydop pic.twitter.com/eaCNBJOUrB