Vishwak Sen: వచ్చేసిన ‘మెకానిక్ రాకీ’ ట్రైలర్.. ఎలాఉందంటే?

by sudharani |
Vishwak Sen: వచ్చేసిన ‘మెకానిక్ రాకీ’ ట్రైలర్.. ఎలాఉందంటే?
X

దిశ, సినిమా: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) నటిస్తున్న తాజా చిత్రం ‘మెకానిక్ రాకీ’ (Mechanic Rocky). రవితేజ ముళ్లపూడి (Ravi Teja Mullapudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా.. అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. కమర్షియల్ ఎంటర్‌టైన్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని రామ్ తాళ్లూరి (Ram Talluri) భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇక ఇందులో నుంచి ఇప్పటికే వచ్చిన ప్రతి అప్‌డేట్ (Update) ఎంతో ఆకట్టుకోగా.. తాజాగా ట్రైలర్ (trailer) రిలీజ్ చేశారు చిత్ర బృందం.

‘నువ్వేం ఫికర్ చెయ్యకు నాన్న.. ఎట్లైనా సివిల్ ఇంజినీర్ (Civil Engineer) అయిపోతా నేను’ అనే డైలాగ్‌తో ట్రైలర్ (trailer) స్టార్ట్ కాగా.. ‘కంప్యూటర్ సైన్స్ చదివి సివిల్ ఇంజినీర్ (Civil Engineer) అవుతావా’ అని తండ్రి షాక్ అవుతాడు. ఇక కొడుకుతో మెకానిక్ షెడ్ ఓపెన్ చేయిస్తాడు తండ్రి. అక్కడ బండ్లు రిపేర్ చేస్తూనే.. అమ్మాయిలకు డ్రైవింగ్ నేర్పుతూ ఉంటాడు మన హీరో విశ్వక్ (Vishwak). ఈ క్రమంలో ఒక హీరోయిన్ అతన్ని ప్రేమిస్తే.. మరో హీరోయిన్‌ను ఇతను ప్రేమిస్తాడు. మరి ఈ ట్రైయాంగిల్ లవ్ స్టోరీ ఎటు వెళ్తుందో తెలియదు కానీ.. విలన్‌గా మాత్రం సునీల్ (Sunil) ఎంట్రీ ఇస్తాడు. అక్కడ నుంచి మాస్ మజా స్టార్ట్ అవుతోంది. ఫైనల్‌గా ఈ సినిమా ద్వారా విశ్వక్ మాస్ ఆడియన్స్‌ను అయితే పక్కా మెప్పిస్తాడు అనిపిస్తోంది.


Advertisement

Next Story