Brahmin Community : యావత్ సమాజానికి బ్రాహ్మణుల మార్గనిర్దేశం : హిమాచల్‌ గవర్నర్

by Hajipasha |
Brahmin Community : యావత్ సమాజానికి బ్రాహ్మణుల మార్గనిర్దేశం : హిమాచల్‌ గవర్నర్
X

దిశ, నేషనల్ బ్యూరో : బ్రాహ్మణులు యావత్ సమాజానికి మార్గనిర్దేశం చేస్తున్నారని హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. జాతీయతా భావన అనేది ప్రజలకు సహజసిద్ధంగా మనసులో నుంచే రావాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అఖిల భారతీయ బ్రాహ్మణ మహాసభ ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్‌లోని బులంద్ షహర్‌లో జరిగిన బ్రాహ్మణ ఐక్యతా సమావేశానికి గవర్నర్ శివప్రతాప్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఇదే కార్యక్రమంలో రాజస్థాన్ మాజీ గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా కూడా మాట్లాడారు. సామాజిక చైతన్యాన్ని సాధించే సంకల్పంతో అన్ని బ్రాహ్మణ సంఘాలను ఏకం చేయడమే ఈ సదస్సు ముఖ్య లక్ష్యమన్నారు.

‘‘సమాజంలోని అన్ని వర్గాల పురోగతిలోనూ బ్రాహ్మణులు భాగస్వాములుగా ఉంటున్నారు. దేశ వికాసం కోసం వారు అత్యంత అంకితభావంతో శ్రమిస్తున్నారు. ఈ తరుణంలో సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్న వారిని గుర్తుపట్టాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది’’ అని కల్‌రాజ్ మిశ్రా పేర్కొన్నారు. ఇటీవలే ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌ జిల్లాలో జరిగిన మత ఘర్షణలను ఆయన ఖండించారు. ‘‘ఐక్యత అనేది సమాజంలోని వివిధ కులాల వారి మధ్య ఉంటే సరిపోదు. యావత్ సమాజంలోనూ ఆ భావన ఉండాలి’’ అని బీజేపీ మాజీ నాయకురాలు నుపుర్ శర్మ పేర్కొన్నారు.

Advertisement

Next Story